అదిరిపోయే న్యూస్: హాట్ బ్యూటితో నాని స్పెషల్ సాంగ్.. అభిమానులకు పండుగ..!

నాచురల్ స్టార్ నాని హీరోగా తెరకెక్కుతున్న కొత్త సినిమా దసరా . ఈ సినిమాను నూతన దర్శకుడు శ్రీకాంత్ ఓదెల తెరకెక్కిస్తున్నాడు.ఇందులో నానికి జంటగా కీర్తి సురేష్ నటిస్తుంది. ఇక అయితే ఇప్పుడు తాజాగా ఈ సినిమా నుండి మరో క్రేజీ అప్డేట్ ఒకటి బయటికి వచ్చింది. ఆ అప్డేట్ ఏమిటంటే.. ఈ సినిమాలో ఓ స్పెషల్ సాంగ్ ఉందని తెలుస్తుంది. ఆ సాంగ్ లో మిల్కీ బ్యూటీ తమన్నాా నటిస్తుందని.. ఈ సినిమా ప్రొడ్యూసర్లు తమన్నాని ఇప్పటికే సాంగ్ లో నటించమని కోరినట్టు టాలీవుడ్ వర్గాల్లో టాక్ నడుస్తుంది. తమన్నా కూడా సాంగ్ లో నటించేందుకు ఓకే అందట.

ఒక్క వేళ అదే నిజమైతే తమన్నా- నాని కాంబినేషన్లో అదిరిపోయే సాంగ్ రాబోతున్నటే. ఇక ఇప్పుడు ఈ వార్త వినిపించగానే నాని అభిమానుల్లో ఓ పండగ వాతావరణం నెలకొంది. ఈ సినిమాలో సాయికుమార్, సముద్ర ఖని, జరీనా వహబ్ఈ కీలకపాత్రలో నటిస్తున్నారు. ఈ సినిమాకి సంతోష్ నారాయణ మ్యూజిక్ అందిస్తున్నాడు.. శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్ బ్యానర్ పై సుధాకర్ చెరుకూరి ఈ సినిమాని నిర్మిస్తున్నాడు. ఈ సినిమాను డిసెంబర్‌లో ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నట్టు తెలుస్తుంది.