అల్లు స్టూడియోస్ ను చాలా ఘనంగా ప్రారంభించిన చిరంజీవి.. ఫొటోస్ వైరల్..!!

దివంగత నటుడు అల్లు రామలింగయ్య శత జయంతి దినోత్సవ ఉత్సవాలను చాలా ఘనంగా నిర్వహిస్తున్నారు అల్లు అరవింద్. ఇక అందులో భాగంగానే ఈరోజు అల్లు రామలింగయ్య శత జయంతి సందర్భంగా అల్లు అరవింద్ అలాగే అల్లు అర్జున్ అల్లు స్టూడియోను గ్రాండ్ గా ప్రారంభించారు. ఇక ఈ వేడుకకు చీఫ్ గెస్ట్ గా చిరంజీవి, ఆయన సతీమణి సురేఖ కొణిదల హాజరయ్యారు. అంతేకాదు చిరంజీవి చేతుల మీదుగా ఈ కొత్త స్టూడియోస్ ను ప్రారంభించడం జరిగింది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫోటోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి. ఇదిలా ఉండగా అల్లు స్టూడియోను అల్లు ఫ్యామిలీ గత ఏడాది హైదరాబాద్ సిటీ ఔట్ స్కర్ట్స్ లో ఉన్న గండిపేటలో మొదలుపెట్టారు

.Allu Studios | Chiranjeevi : అల్లు స్టూడియోస్‌ను ప్రారంభించిన చిరంజీవి..  పిక్స్ వైరల్.. Chiranjeevi launched Allu Studios today pics goes viral–  News18 Telugu

ఇక ఈ స్టూడియోస్ నిర్మాణం పూర్తి కావడంతో ఇవాళ అల్లు రామలింగయ్య 100వ పుట్టినరోజు సందర్భంగా ఈ స్టూడియోస్ ను చాలా గ్రాండ్ గా లాంచ్ చేశారు. ముఖ్యంగా అత్యాధునిక టెక్నాలజీతో అన్ని సదుపాయాలు ఉన్న ఈ స్టూడియోను గండిపేట లో ఉన్న పది ఎకరాలలో భారీగా నిర్మించారు.

 పుష్ప సినిమా ద్వారా అల్లు అర్జున్ ఉత్తరాది ప్రేక్షకులకు బాగా దగ్గరైయారు. ఇక అది అలా ఉ:టే ‘పుష్ప-2’ కోసం సినీ ప్రియులు ఉత్సుకతతో ఎదురుచూస్తున్నారు. ఇక ఈ సినిమాలో మొదటి భాగంలో అల్లు అర్జున్ ఎర్రచందనం స్మగ్లర్‌గా మాస్‌ లుక్‌‌లో కేక పెట్టించిన సంగతి తెలిసిందే. అయితే సీక్వెల్‌లో కూడా కొద్ది మార్పులతో అదే లుక్‌ను కొనసాగిస్తారట. ఈ సినిమా కోసం అల్లు అర్జున్ 125 కోట్ల వరకు రెమ్యూనరేషన్ తీసుకుంటున్నట్లు టాక్ నడుస్తోంది. .  Photo : Twitterఇక్కడ మరొక విషయం ఏమిటంటే అల్లు అర్జున్ హీరోగా నటిస్తున్న పుష్ప 2 సినిమా కూడా ఎక్కువగా షూటింగ్ ఇక్కడే జరుపుకోవాలని సినిమా షూటింగ్ కి సంబంధించిన అన్ని పనులు ఇప్పటికే ప్రారంభించారు అని కూడా సమాచారం. మొత్తానికైతే అల్లు వారి కల అల్లు స్టూడియో తో నెరవేరింది అని చెప్పవచ్చు.

Chiranjeevi Launches Allu Studios - Movie News
అంతేకాదు అల్లు ఫ్యామిలీకి , మెగా ఫ్యామిలీకి మధ్య ఉన్న విభేదాలు కూడా ఇక్కడితో దూరం అయ్యాయి. గత కొన్ని రోజుల నుంచి అల్లు అర్జున్ అభిమానులు రామ్ చరణ్ ను.. రామ్ చరణ్ అభిమానులు అల్లు అర్జున్ ను విపరీతంగా ట్రోల్ చేసిన విషయం తెలిసిందే. కానీ ఎట్టకేలకు అల్లు అర్జున్ దగ్గరుండి స్వయంగా తన మామ చిరంజీవి, మేనత్త సురేఖతో తన తాత శత జయంతి దినోత్సవ వేడుకలను జరిపించారు. ప్రస్తుతం ఈ ఫోటోలు వైరల్ అవుతుండగా వీరి మధ్య గొడవలకు కూడా స్వస్తి పలికినట్టు అయింది.

Share post:

Latest