ఆచార్య: డైరెక్టర్ ఎలా చెబితే అలా చేశాము.. చిరు ఓపెన్ కామెంట్స్ ..!!

తెలుగు సినీ ఇండస్ట్రీలో మెగాస్టార్ చిరంజీవికి ఎంత క్రేజీ ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. అయితే చిరంజీవి కెరియర్ లో కూడా ఎన్నో ఫ్లాప్స్ ఉన్నాయని అందరికీ తెలిసింది. అయితే చిరంజీవి రాజకీయాల నుంచి రియంట్రీ ఇచ్చి ఆ తర్వాత వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు. అయితే అలా వరుస పెట్టి సినిమాలు చేసుకుంటున్నా సమయంలో కేవలం ఒక్క ఫ్లాప్ తో క్రెడిట్ మొత్తం పోగొట్టుకున్నారు చిరంజీవి ఆ చిత్రమే ఆచార్య. అయితే ఈ సినిమా పై మరొకసారి పలు ఆసక్తికరమైన విషయాలు చేశారు చిరంజీవి వాటి గురించి చూద్దాం.

Koratala Siva Puts Pressure on Chiranjeevi; Chiru talks to Rajamouli?

ఇక చిరంజీవి గాడ్ ఫాదర్ సినిమా ప్రమోషన్లలో భాగంగా మాట్లాడుతూ.. తన ప్రీవియస్ నటించిన చిత్రం ఆచార్య ప్లాప్ క్రెడిట్ మొత్తాన్ని ఇన్ డైరెక్టుగా డైరెక్టర్ కొరటాల శివ పైనే చెప్పినటువంటి కామెంట్స్ అందరిని ఆశ్చర్యపరుస్తున్నాయి. మెగాస్టార్ చిరంజీవి ఆచార్య సినిమా ఫ్లాప్ తనకు ఎలాంటి ఎఫెక్ట్ ఇవ్వలేదని.. ఇది పూర్తిగా డైరెక్టర్ ఛాయస్ అని.. నేను అలాగే రామ్ చరణ్ .. దర్శకుడు ఎలా చెబితే అలాగే ఫాలో అయ్యామని ఓపెన్ గా తెలియజేశారు. దాంతోపాటు ఆ సినిమా విషయంలో కేవలం ఒకే ఒక్క నిరాశ ఉందని తెలిపారు అది నేను రాంచరణ్ కలిసి చేసిన ఈ సినిమా ఇలాంటి రిజల్ట్ ఇస్తుందని ఊహించలేదని తెలిపారు.

🔴Live : #Acharya With Young Directors | Megastar Chiranjeevi , Ram charan  , Koratala Shiva - YouTube
అయితే ఈ సినిమా రాబోయే రోజుల్లో తామిద్దరం కలిసి చేసే సినిమాల మీద ఇంపాక్ట్ ఉండవచ్చని తెలియజేశారు చిరంజీవి. ఈ కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో చాలా వైరల్ గా మారుతున్నాయి. అపజయం అంటే తెలియని డైరెక్టర్ కొరటాల శివకు కూడా మొదటిసారి తన కెరీర్లు ఇలాంటి రిసల్ట్ రావడం ఎవరు ఊహించలేదు. ఇక చిరంజీవి, రామ్ చరణ్ తో కలిసి చేసిన ఈ సినిమా తన ఫ్యూచర్ ని మారుస్తుందని అందరూ అనుకున్నారు. కానీ ఫ్లాప్ ఆవ్వడంతో ఇప్పుడు డైరెక్టర్ ఫాల్ట్ అనడంతో ఈ విషయం సోషల్ మీడియాలో వైరల్ గా మారుతోంది.