బుల్లితెర సుధీర్ కెరియర్ నాశనం కావడానికి ఆ తప్పులే కారణమా..?

సుడిగాలి సుధీర్.. ఒక మెజీషియన్ గా తన కెరీర్ ను మొదలుపెట్టి ఆ తర్వాత కమెడియన్ వేణు సహాయంతో జబర్దస్త్ లోకి అడుగు పెట్టాడు. అలా మొదట్లో స్క్రిప్ట్ రైటర్ గా పనిచేసిన సుధీర్ ఆ తర్వాత టీం లో ఒకరిగా పనిచేసి తన కామెడీ టైమింగ్ తో ప్రేక్షకులను పలకరించి అతి తక్కువ సమయంలోనే టీం లీడర్ గా గుర్తింపు తెచ్చుకున్నాడు. అక్కడ తన కామెడీ టైమింగ్ తో పంచులతో ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించి బుల్లితెర మెగాస్టార్ గా గుర్తింపు తెచ్చుకున్నారు. ఒకవైపు జబర్దస్త్ మరొకవైపు ఢీ, శ్రీదేవి డ్రామా కంపెనీ వంటి కార్యక్రమాలకి హోస్ట్ గా కూడా వ్యవహరించాడు. ఇక మల్లెమాల సంస్థ కూడా సుధీర్ కి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చింది. అతడిని ఒక రేంజ్ లో ఎలివేట్ చేయడం కోసం రష్మితో లవ్ ట్రాక్ నడిపించి అతని కెరియర్ కు ప్లస్ అయ్యేలా చేసింది మల్లెమాల.

Sudigali Sudheer: నాకు దూరంగా ఉండూ.. సుధీర్‏కు కౌంటర్ వేసిన హీరోయిన్.. |  TV9 Telugu

ఇక ఇక్కడ మంచి గుర్తింపు తెచ్చుకొని ఏకంగా సినిమాలలో హీరోగా చేసే అవకాశాన్ని అందుకున్నాడు. అలా మొదటిసారి సాఫ్ట్వేర్ సుదీర్ సినిమాతో హీరోగా తెలుగు తెరకు పరిచయమయ్యాడు. కానీ ఈ సినిమాతో ప్రేక్షకులను పెద్దగా మెప్పించలేదు. కానీ పట్టు విడవకుండా ప్రస్తుతం గాలోడు, కాలింగ్ సహస్ర వంటి చిత్రాలలో హీరోగా చేస్తున్నారు. ఈ సినిమా షూటింగ్లలో బిజీగా ఉండడం వల్లే అటు ఈటీవీ కి శాశ్వతంగా దూరం అయ్యారు. మొదట ఢీ షో నుంచి తప్పుకున్న సుధీర్ ఆ తర్వాత జబర్దస్త్ శ్రీదేవి డ్రామా కంపెనీ వంటి షో లకి కూడా గుడ్ బై చెప్పారు. అయితే ఉన్నట్టుండి బుల్లితెర కి గుడ్ బై చెప్పడంతో అందరిలో పలు అనుమానాలు కలిగాయి. మరొకటి పారితోషకం విషయంలోనే ఆయన జబర్దస్త్ కి దూరం అయ్యారు అని కూడా కథనాలు వినిపిస్తుంటాయి.

Chalaki Chanti movies, filmography, biography and songs - Cinestaan.com

అయితే ఈ విషయంపై తాజాగా చంటి స్పందిస్తూ సుడిగాలి సుదీర్ చేసిన రెండు తప్పులు మల్లెమాల సంస్థకు దూరం అయ్యేలా చేశాయని.. నేను విన్నాను అంటూ ఆయన తెలిపారు. సుడిగాలి సుదీర్ చేసిన కొన్ని పనులు నచ్చని మల్లెమాల అతడిని దూరం పెట్టిందన్నారు. సుడిగాలి సుదీర్ మళ్ళీ జబర్థస్త్ కి రావాలని ప్రయత్నం చేస్తున్నానే వాదన కూడా వినిపిస్తుండగా చలాకి చంటి ఈ విధంగా స్పందించారు.. మనకు గుర్తింపు ఇచ్చిన సంస్థ పట్ల గౌరవంతో ఉండాలి.. నేను మూడుసార్లు జబర్దస్త్ నుంచి బయటకు వచ్చి మళ్లీ వెళ్లాను. బయటకు వెళ్లిన సహేతుకమైన కారణంతో వెళ్లాను. సంస్థకు ఎప్పుడు లాయల్ గా ఉండాలి. ఎలాంటి రిలేషన్ కలిగి ఉన్నదని అన్నది చూడాలి.. ఇలాంటివేవీ సుదీర్ దగ్గర లేకపోవడం వల్లే అతడు తన కెరియర్లో నష్టాలు చవిచూస్తున్నాడు అంటూ తెలిపాడు చంటి.