ప్ర‌భాస్‌ ఆదిపురుష్‌ సినిమాను మించిన… మరో రామాయణం సినిమాగా వస్తుందా..!

తింటే గారెలే తినాలి… వింటే రామాయణమే వినాలన్న పెద్దలు సామెత మనకు తెలిసిందే… రామాయణాన్నిఎన్నిసార్లు చదివినా… రాముడి గురించి ఎంత తెలుసుకున్నా తక్కువే. తెరమీద రామాయణాన్ని ఎందరో నటీనటులు డైరెక్టర్లు తెరకెక్కించారు. ఎన్నిసార్లు రామాయణాన్ని తెరకెక్కించిన మళ్లీమళ్లీ చూడాలనిపిస్తుంది. ఎందరో హీరోలు రాముడు గా నటించాలని కోరుకుంటూ ఉంటారు. తెలుగు తెరపై రాముడిగా నటించి అలరించిన వారిలో ప్రధానంగా మనంఎన్టీఆర్ ని రాముడు గా గుర్తు చేసుకుంటాం. ఆయన తర్వాత శోభన్ బాబు, బాలకృష్ణ వంటి నటులు రాముడు పాత్రలు నటించారు.

List of Telugu actors who essayed Lord Rama on screen

ఈ తరం నటులలో ప్రస్తుతం ప్రభాస్ ఆది పురుష్‌ సినిమాలో నటిస్తున్నాడు. ఈ సినిమాను సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. తాజాగా ఈ సినిమా టీజర్ ను సినిమా యూనిట్ విడుదల చేశారు. ఈ టీజర్ కు ప్రేక్షకుల నుండి మిశ్రమ స్పందన వస్తుంది. ఇప్పుడు మరో రాముడు వస్తున్నట్లు సోషల్ మీడియాలో ఒక వార్త హల్చల్ చేస్తుంది. విషయం ఏమిటంటే కంగనా రనౌత్ బాలీవుడ్ లో మరో రామాయణాన్ని తీస్తుందట. రీసెంట్గా ఈ సినిమాకు సంబంధించిన మోషన్ పోస్టర్ను కూడా విడుదల చేశారు. బాలీవుడ్ లో ఈ సినిమాను సీత: ది ఇంకార్నేషన్.. ఇందులో కంగనా సీతగా టైటిల్ రోల్ లో నటించబోతుంది.

ఈ సినిమాను అలౌకిక్ దేశాయ్ డైరెక్ట్ చేయబోతున్నాడు. టాలీవుడ్ దిగ్గజ రచయిత విజయేంద్రప్రసాద్ ఈ సినిమాకు స్టోరీ అందిస్తున్నాడు. కంగనా ఈ సినిమాను ఎప్పుడో ప్రకటించిన‌. ఈ సినిమా ఇప్పుడు వరకు ఇంకా షూటింగ్ మొదలు కాలేదు. తాజా సమాచారం ప్రకారం ప్రస్తుతం ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుగుతుంది. ఈ సినిమాలో రాముడు గా కోలీవుడ్ స్టార్ హీరో విక్రమ్ నటిస్తున్నట్టు తెలుస్తుంది. విక్రమ్‌కు ఈ సినిమా కథ నచ్చడంతో తను నటించేందుకు ఓకే చెప్పాడట. విక్రమ్‌ తాజాగా పొన్నియిన్ సెల్వన్ లో చోళ రాజు ఆదిత్య కరికాలాన్ గా నటించి మెప్పించాడు. రాముడు పాత్రల్లో విక్రమ్ కచ్చితంగా సూట్ అవుతాడని.. అందుకే ఈపాత్రకు ఆయనను ఎంపిక చేసినట్టు తెలుస్తుంది. ఈ వార్తపై ఇంకా అధికార ప్రకటన రావాల్సి ఉంది.

Share post:

Latest