పుష్ప-2 కోసం రూ.125 కోట్లు పారితోషకం తీసుకుంటున్న బన్నీ.. సుకుమార్‌కి మాత్రం?

ప్రస్తుతం ‘పుష్ప’ సినిమా గురించి దేశమంతటా మాట్లాడుకుంటున్నారు. అంతే కాకుండా పుష్ప సినిమా లో అల్లు అర్జున్ యాక్టింగ్, సుకుమార్ డైరెక్షన్‌ను బాగా పొగుడుతున్నారు. పుష్ప సినిమాతో పాన్ ఇండియా స్టార్ గా పేరు తెచ్చుకున్నాడు బన్నీ. పార్ట్ 1 సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అవడంతో పుష్ప 2పై ప్రేక్షకుల్లో అంచనాలు భారీగా ఉన్నాయి. అయితే ఈ సినిమా డైరెక్టర్ సుకుమార్ పుష్ప 2కి రెమ్యునరేషన్ తీసుకోకుండా పనిచేస్తున్నాడనే ఓ వార్త ప్రస్తుతం సినీ సర్కిల్‌లో చక్కర్లు కొడుతోంది.

పుష్ప సినిమా మంచి విజయం సాధించడం వల్ల డైరెక్టర్ సుకుమార్ రెమ్యునరేషన్ భారీగా పెంచేశాడట. సాధారణంగా ఒక్కో సినిమాకి రూ.15 కోట్లు తీసుకునే సుకుమార్ ఇప్పుడు ఏకంగా రూ.60 కోట్ల డిమాండ్ చేస్తున్నాడని సినిమా వర్గాలు అంటున్నాయి. అయితే పుష్ప 2 సినిమాకి మాత్రం సుకుమార్ రూపాయి కూడా రెమ్యునరేషన్‌గా తీసుకోవట్లేదట. అందుకు బదులుగా ఈ దర్శక దిగ్గజం తన సుకుమార్ ప్రొడక్షన్స్‌ను పుష్ప సినిమా ప్రొడక్షన్ లో ఒక భాగం చేశారు. అలా కోప్రొడ్యూసర్ గా మారి ఈ మూవీ లాభాల్లో కొంత వాటా అడుగుతున్నాడట. సుకుమార్ తీసుకునే రెమ్యునరేషన్‌తో పోలిస్తే లాభాల్లో వాటా అనేది తక్కువేం కాదని పలువురు అంటున్నారు. వచ్చిన లాభాల్లో దాదాపు రూ.70 కోట్ల వరకూ పొందుతాడని తెలుస్తుంది.

అంతే కాదండోయ్ ఇంకో వార్త ఏంటంటే బన్నీ పుష్ప 2కి రూ.125 కోట్లు రెమ్యునరేషన్‌ తీసుకుంటున్నాడట. పుష్ప సినిమా పాన్ ఇండియా లెవెల్‌లో సూపర్ హిట్ గా నిలవడంతో దేశవ్యాప్తంగా సినీ ప్రేక్షకులు పుష్ప 2 సినిమా పై ఆసక్తి కనబరుస్తున్నారు. దీనిని మొదటి రోజే చాలా ఎక్కువ మంది చూసే అవకాశాలు ఉన్నాయి. బాహుబలి 2, కేజీఫ్ 2 కోసం ప్రేక్షకులు ఎంత ఆసక్తితో ఎదురు చూసారో అంతే ఆసక్తిగా పుష్ప 2 కోసం ఎదురు చూస్తున్నారు. అందువల్ల ఈ సినిమా థియేట్రికల్ రైట్స్, శాటిలైట్ రైట్స్,ఓటీటీ రైట్స్‌ సేల్స్‌లో భారీ మొత్తంలో లాభాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి.

Share post:

Latest