ఐశ్వర్య – అభిషేక్ బచ్చన్ విడాకులు తీసుకోబోతున్నారా? అభిషేక్ ట్వీట్ వైరల్..!!

మాజీ విశ్వ సుందరి గా గుర్తింపు తెచ్చుకున్న ఐశ్వర్యారాయ్ సినీ ఇండస్ట్రీలో మంచి గుర్తింపు సొంతం చేసుకుంది. కేవలం హిందీలోనే కాకుండా సౌత్ సినీ ఇండస్ట్రీలో కూడా తనకంటూ మంచి గుర్తింపును తెచ్చుకున్న ఈమె అమితాబ్ బచ్చన్ కొడుకు అభిషేక్ బచ్చన్ ను వివాహం చేసుకుంది. అభిషేక్ బచ్చన్ కు తండ్రి రేంజ్ లో గుర్తింపు లభించలేదు కానీ ఆయన సెకండ్ హీరో గానే సెటిల్ అయ్యాడు. ఇకపోతే ఐశ్వర్య రాయ్ ను వివాహం చేసుకున్న తర్వాత ఈయన క్రేజ్ మరింత పెరిగిందని చెప్పవచ్చు. ఇకపోతే ఈ జంట విడాకులు తీసుకుంటున్నారు అంటూ ఎన్నోసార్లు ప్రచారం జరిగిన విషయం తెలిసిందే. కానీ అది అసత్య ప్రచారమాన్ని అభిషేక్ సన్నిహితుల నుండి వార్తలు వినిపించాయి. కానీ ఇప్పుడు మళ్లీ ఇదే వార్త వెలుగులోకి రావడం అందర్నీ ఆశ్చర్యానికి గురిచేస్తుంది.

Aishwarya Rai Bachchan

ఇకపోతే మొన్నటికి మొన్న దీపిక – రణవీర్ కూడా విడాకులు తీసుకోబోతున్నట్లు .. అందుకు కారణం రణ్వీర్ చేసిన న్యూడ్ ఫోటో షూట్ కారణమనే ప్రచారం జరిగింది.. బాయ్ కాట్ ట్రెండ్ బోర్ కొట్టి కొంతమంది నెట్టింట ఇలాంటి వార్తలను వైరల్ చేసి ట్రెండింగ్లో నిలబెడుతున్నారా? ఏంటి? అన్న విషయంపై కూడా ప్రస్తుతం చర్చలు జరుగుతున్నాయి. ఇక అభిషేక్ బచ్చన్ ఐశ్వర్యరాయ్ విడాకులు తీసుకుంటున్నారు అనే వార్త మళ్ళీ తెర పైకి రావడానికి కారణం అభిషేక్ బచ్చన్ చేసిన ట్వీట్ అనే చెప్పవచ్చు. ఇక ఆయన తన ట్వీట్ ద్వారా.. నేను విడాకులు తీసుకోబోతున్నాను అంటూ కొంతమంది ప్రచారం చేస్తున్నారు.. అందుకు నేను సిద్ధమే ..అలాగే నాకు రెండో పెళ్లి చేయాల్సిన బాధ్యత కూడా మీదే.. అది మర్చిపోకండి థాంక్యూ అంటూ చాలా వ్యంగ్యంగా ట్వీట్ చేశాడు.

ఇక 2007 ఏప్రిల్ 20 న జరిగింది. 2014లో వీరికి ఒక పాప కూడా జన్మించింది. ఇక పాపకి ఆరాధ్య అనే పేరు కూడా పెట్టారు.. ఇకపోతే ఒక ఇంటర్వ్యూలో ఐశ్వర్య గురించి అభిషేక్ మాట్లాడుతూ.. ఐశ్వర్యతో నా జీవితం ఎలా నడిపించాలో నిర్దేశించడానికి మూడో వ్యక్తి అవసరం లేదు.. నేను ఎంత ప్రేమిస్తున్నానో ఆమెకు తెలుసు.. ఎవరో కావాలని మేము విడాకులు తీసుకుంటున్నామని అసత్య ప్రచారం చేస్తున్నారు.. ఇకనైనా మానుకోండి అంటూ గట్టిగా ట్వీట్ చేశాడు అభిషేక్.

https://twitter.com/juniorbachchan/status/467135402982129664?ref_src=twsrc%5Etfw%7Ctwcamp%5Etweetembed%7Ctwterm%5E467135402982129664%7Ctwgr%5E6d6b8e4664f221e15733ff2bab461c29c7066086%7Ctwcon%5Es1_c10&ref_url=https%3A%2F%2Fd-26425105342212254110.ampproject.net%2F2209142312000%2Fframe.html