కేవలం డబ్బులకి ఇబ్బందిపడే ఆ సినిమా చేయవలసి వచ్చింది: శ్రీకాంత్

ఈ దేశంలో రాజకీయనాయకులు, సినిమావాళ్లు దండిగా డబ్బులు సంపాదిస్తుంటారని ఓ నానుడి. అయితే దానిని కాదనలేము. రాజకీయాలు అటుంచితే, సినిమాలలో కూడా అత్యంత తక్కువశాతం మంది మాత్రమే వారి స్టార్ డంని బట్టి అత్యధికంగా డబ్బులు సంపాదిస్తూ వుంటారు. మిగిలినవాళ్లు పరిస్థితి చాలా అద్వాన్నంగా ఉంటుంది. ఇక తెలుగు సినీ పరిశ్రమలో ఎంతోమంది స్టార్ పొజిషన్ కి రావాలని కలలు కంటూ వుంటారు. ఈ క్రమంలో కొంతమందికి అవకాశాలు వచ్చినా వాటిని సద్వినియోగం చేసుకోలేక చాలా సతమతమవుతూ ఉంటారు.

అయితే కొందరు మాత్రం వచ్చిన ప్రతి అవకాశాన్ని చిన్నా, పెద్ద అని తేడాలేకుండా సద్వినియోగం చేసుకొని ముందుకి సాగిపోతూ వుంటారు. నటుడు శ్రీకాంత్ అయ్యంగర్ కూడా కెరియర్ ప్రారంభ సమయంలోనే మంచి పాపులారిటీ సంపాదించారు. వృత్తిపరంగా డాక్టర్ అయినప్పటికీ యాక్టర్ కావాలనే కోరికతో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టారు. అలా కరోనా వైరస్, డియర్ కామ్రేడ్, ప్రతిరోజు పండగ, మజిలీ తదితర సినిమాలలో నటించి మంచి గుర్తింపు సంపాదించుకున్నారు. వర్మ ఫ్యాక్టరీనుండి వచ్చిన శ్రీకాంత్ అయ్యర్ మాటలు కూడా అచ్చం వర్మని తలపించేవిగా ఉంటాయి.

తాజాగా ఓ మీడియా వేదికగా అతను అనేక విషయాలు పంచుకున్నారు. సినిమా షూటింగ్ లేకపోతే అస్సలు ఏమి తోచదట శ్రీకాంత్ గారికి. ఇకపొతే శివ నిర్వాణ దర్శకత్వంలో వచ్చిన మజిలీ చిత్రంలో తను కేవలం చిన్న పాత్రలోనే చేసానని, సరిగ్గా అదే సమయంలో కుటుంబంతో కలిసి గోవాకి వెళ్తున్నందువలన దారి ఖర్చులకు ఉంటాయి కదా అనుకోని ఆ సినిమా చేశారట. సరిగ్గా 4 నెలల తర్వాత ఆ సినిమాలో సీన్ చూసి డైరెక్టర్ మారుతి గారు ఫోన్ చేసి ప్రతిరోజు పండగే సినిమాలో తనకి అవకాశం కలిపించారని ఆనాటి సంగతులు చెప్పుకొచ్చారు.