ఇదేం రాజ‌కీయం.. జుట్టంతా వైసీపీ చేతికి ఇస్తున్నారే….!

ఏమో అనుకుంటారు కానీ.. రాజకీయాల్లో ప్ర‌త్య‌ర్థుల‌కు మేలు చేసే కార్య‌క్ర‌మాలు కూడా.. తెర‌మీదికి వ‌స్తు న్నాయి. ఒక‌ప్పుడు ప్ర‌త్య‌ర్థి పార్టీల‌ను ఓడించాల‌నే దృఢ‌మైన నిర్ణ‌యం తీసుకున్న పార్టీలు.. ఏవైనా.. చా లా జాగ్ర‌త్త‌గా వ్య‌వ‌హ‌రించేవి. ప్ర‌త్య‌ర్థి పార్టీల లోపాల‌ను ప‌సిగ‌ట్టి.. సైలెంట్‌గా ప్ర‌జ‌ల మ‌ధ్య‌కు తీసుకువె ళ్లేవారు. అయితే.. ఇప్పుడు మాత్రం ఈ రాజ‌కీయాలు మారిపోయాయి. ప్ర‌త్య‌ర్థుల‌కు ఆయుధాలు అందిస్తున్న‌ట్టుగా.. నాయ‌కులు వ్య‌వ‌హ‌రిస్తున్నారు.

అధికార పార్టీని తీసుకుంటే.. వైసీపీ అధినేత .. జ‌గ‌న్‌.. చాలా ఆచితూచి వ్య‌వ‌హ‌రిస్తున్నారు. ఎక్క‌డా ప్ర‌త్య‌ర్థి పార్టీల‌కు ఆయ‌న ఛాన్స్ ఇవ్వ‌డం లేదు. ఏం జ‌రిగినా.. ఆయ‌న లోపాయికారీగా.. క్లూ ఇస్తున్నారు త‌ప్పితే.. ఎక్క‌డా విష‌యాన్ని బ‌య‌ట‌కు చెప్పేయడం లేదు. నాయ‌కుల గ్రాఫ్‌ను బ‌ట్టి.. వ‌చ్చే ఎన్నిక‌ల్లో టికెట్లు ఇస్తామ‌న్నారు.. ఇది చాలా పెద్ద వ్యూహం. దీనివెనుక‌.. పార్టీని న‌డిపించే దృఢ‌మైన సంక‌ల్పం ఉంది. ఎవ‌రికీ దాదాపు ఒక‌టి రెండు త‌ప్ప‌.. టికెట్లు క‌న్ఫ‌ర్మ్ చేయ‌లేదు.

ఎందుకంటే.. వ‌చ్చే ఎన్నిక‌ల్లో వారు బ‌లంగా ప‌నిచేయాలంటే.. వారినిడిఫెన్స్‌లోనే ఉంచాల‌నే రాజ‌కీయ వ్యూహాన్ని అనుస‌రిస్తున్నారు.కానీ, ప్ర‌తిప‌క్షం టీడీపీని చూస్తే.. సిట్టింగులు అంద‌రికీ టికెట్లు ఇస్తామ‌ని చెప్పేసింది. అంటే.. పనిచేసినా.. చేయ‌క‌పోయినా.. పార్టీలో సిట్టింగులు భేషుగ్గా.. టికెట్ తెచ్చుకోవ‌చ్చు. వారు గెలుస్తారా? లేదా.. అనే సంశ‌యం అక్క‌ర్లేదు. ఇది.. పార్టీకి మేలు కంటే.. కూడా ఎంతో కొంత ఇబ్బంది పెడుతుంద‌నే వాద‌న వినిపిస్తోంది.

ఇక‌, తాజాగా జ‌న‌సేన విష‌యాన్ని తీసుకుంటే.. 67 స్థానాల్లో.. వైసీపీ విజ‌యం ద‌క్కించుకుంటుంద‌ని చెప్పారు. ఇలా చెప్ప‌డాన్ని కూడా.. రాజకీయ విశ్లేష‌కులు త‌ప్పుబ‌డుతున్నారు. 67 స్థానాలు అంటే మామూలు విష‌యం కాద‌ని.. అంటే.. దీనిని బ‌ట్టి వైసీపీ బ‌లంగానే ఉంద‌నే సంకేతాల‌ను పంపించిన‌ట్టు అవుతుంద‌ని.. పైగా…త‌మ‌ను తాము స‌రిచేసుకునేందుకు వైసీపీని హెచ్చ‌రించిన‌ట్టుగా ఉంద‌ని.. అంటున్నారు.

ఈ విష‌యంలో గ‌తంలో జ‌గ‌న్ త‌న పార్టీ నేత‌ల‌కు చెప్పిన‌ట్టు.. 175కు 175 స్థానాల్లో గెలుస్తామ‌ని.. ఆయ‌న ధీమా వ్య‌క్తం చేసిన‌ట్టుగా.. ప‌వ‌న్ కూడా.. మొత్తం అన్ని స్థానాల్లో నూ.. వైసీపీ ఓడిపోవ‌డం ఖాయ‌మ‌ని.. అంటే.. అప్పుడు నిజంగానే వైసీపీలో బెంబేలెత్తే ప‌రిస్తితి వ‌చ్చేద‌ని.. అది ప్ర‌జ‌ల్లోకి బ‌లంగా వెళ్లేద‌ని అంటున్నారు. ఏదేమైనా.. ప్ర‌త్య‌ర్థి పార్టీలు. వైసీపీకి ఆయుధాలు అందిస్తున్నాయ‌నే వాద‌న వినిపిస్తుండ‌డం గ‌మ‌నార్దం.