గోదావరి జిల్లాల్లో సింగిల్ డిజిట్..!

రాష్ట్రంలో అధికారంలోకి రావాలంటే గోదావరి జిల్లాలు చాలా కీలకమని చెప్పొచ్చు…ఈ జిల్లాల్లో ఆధిక్యం తెచ్చుకున్న పార్టీలు అధికారంలోకి వస్తాయి…ఇందులో ఎలాంటి డౌట్ లేదు..అందుకే ఈ రెండు జిల్లాల్లో మెజారిటీ సీట్లు గెలుచుకోవడం కోసం పార్టీలు కష్టపడతాయి. 2014 ఎన్నికల్లో ఈ జిల్లాల్లో టీడీపీ ఎక్కువ సీట్లు గెలుచుకుని అధికారంలోకి వచ్చింది. 2019 ఎన్నికల్లో వైసీపీ సత్తా చాటింది…ఉమ్మడి తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి జిల్లాల్లో వైసీపీ భారీ విజయాలు అందుకుంది.

తూర్పులో 19 సీట్లు ఉంటే 14, పశ్చిమలో 15 సీట్లు ఉంటే 13 సీట్లు గెలుచుకుంది. అంటే మొత్తం 34 సీట్లకు…వైసీపీ 27 సీట్లు గెలుచుకుంది. అటు టీడీపీ 6, జనసేన ఒకటి గెలుచుకుంది. అంటే టీడీపీ సింగిల్ డిజిట్‌కు పరిమితమైంది. అయితే ఈ సారి అక్కడ వైసీపీని సింగిల్ డిజిట్‌కు పరిమితం చేయాలని టీడీపీ చూస్తుంది. ఎలాగైనా గోదావరి జిల్లాల్లో ఎక్కువ సీట్లు గెలుచుకోవాలని చూస్తుంది.

అయితే ఈ సారి గోదావరి జిల్లాల్లో వైసీపీ సత్తా చాటే అవకాశాలు తక్కువ కనిపిస్తున్నాయి…ఇక్కడ కొంతమంది వైసీపీ ఎమ్మెల్యేలు వ్యతిరేకత ఎదురుకుంటున్నారు. ఇటీవల పీకే టీం పేరిట వచ్చిన ఓ సర్వేలో ఉభయ గోదావరిల్లో వైసీపీ 10-13 సీట్లు మాత్రమే గెలుచుకునే అవకాశాలు ఉన్నాయని తేలింది. అయితే కృష్ణా-గుంటూరు, ఉత్తరాంధ్ర జిల్లాల్లో కూడా వైసీపీకి తక్కువ సీట్లే వస్తాయని తెలిసింది. నెల్లూరు, ప్రకాశం, రాయలసీమ జిల్లాల్లో మెజారిటీ సీట్లు గెలుచుకుని మళ్ళీ వైసీపీనే అధికారంలోకి వచ్చే అవకాశాలు ఉన్నాయని సర్వేలో తేలింది.

అయితే ఇక్కడ గోదావరి జిల్లాలు గురించి చెప్పుకోవాలి…ఈ జిల్లాల్లో వైసీపీ బలం బాగా తగ్గుతుంది. పైగా సర్వే జరిగింది…పార్టీలు విడివిడిగా పోటీ చేస్తే…అంటే టీడీపీ-జనసేన సెపరేట్‌గా పోటీ చేస్తే…రెండు జిల్లాల్లో వైసీపీకి 10-13 సీట్లు గెలుచుకునే ఛాన్స్ ఉందని, అదే రెండు పార్టీలు కలిసి పోటీ చేస్తే వైసీపీ సింగిల్ డిజిట్‌కే పరిమితం అవుతుందని విశ్లేషకులు అంటున్నారు. కాబట్టి జగన్..గోదావరి జిల్లాలపై ఫోకస్ పెట్టి, ఇంకా జాగ్రత్తగా పనిచేయాలని చెబుతున్నారు.

Share post:

Latest