గ్లోబల్ వేదికగా రాజమౌళి నోటి నుంచి ఊహించని మాట.. సినీ ప్రముఖులు షాక్..!!

రాజమౌళి ఈ పేరు గురించి ఎంత చెప్పినా తక్కువే. మన తెలుగు ఫిలిం ఇండస్ట్రీ స్థాయిని ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందేలా చేసిన ఏకైక టాలీవుడ్ దర్శక ధీరుడు. ఈయనని అభిమానులు అందరూ ముద్దుగా జక్కన్న అని పిలుచుకుంటారు. ఈయన సినిమా తీస్తే అది శిల్పం లాగా పర్ఫెక్ట్ గా ఎక్కడ పాయింట్ అవుట్ చేయకుండా ఉండేలా ఉంటుందని.. అందుకే ఇతన్ని జక్కన్న అంటూ పిలుచుకుంటూ ఉంటారు. కాగా రాజమౌళి కెరియర్లో ఇప్పటివరకు ఒక్క ఫ్లాప్ సినిమా కూడా పడలేదు. తీసిన ప్రతి సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద ఓ ప్రభంజనం సృష్టించింది .

అంతేకాదు ఈయన సినిమాని నమ్ముకున్న నిర్మాతలు. ఎవరు కూడా లాస్ అవలేదు డబుల్ స్థాయి ప్రాఫిట్ అందుకున్న నిర్మాతలే ఉన్నారు . అందుకే స్టార్స్ ప్రొడ్యూసర్స్ ఈయన సినిమా అంటే ఎగబడి పోతారు. రీసెంట్ గా ఆర్ఆర్ఆర్ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ తన ఖాతాలో వేసుకున్న ఎస్ ఎస్ రాజమౌళి తన తదుపరి ప్రాజెక్టును మహేష్ బాబుతో కమిట్ అయిన సంగతి తెలిసిందే. అయితే దీనిపై ఇప్పటివరకు అఫీషియల్ గా ఎటువంటి ప్రకటన చేయలేదు రాజమౌళి .

రాజమౌళి తండ్రి విజయేంద్ర ప్రసాద్ ఈ సినిమా గురించి అడపాదడపా హింట్ ఇస్తూనే వచ్చారు.. కానీ, ఇప్పటివరకు రాజమౌళి నోటి నుండి మహేష్ బాబుతో సినిమా అంటూ ఆయన ఎక్కడ స్పందించలేదు. ఈవెన్ ఆర్ఆర్ఆర్ ప్రమోషన్స్ లో కూడా రిపోర్టర్స్ ఈ ప్రశ్న గురించి అడిగితే ఇది ఆర్ఆర్ఆర్ ప్రెస్ మీట్ మనం తర్వాత మాట్లాడుకుందాం అంటూ స్కిప్ చేశారే కాని మహేష్ బాబు పేరు తన నోట వినిపించలేదు. కానీ ఫస్ట్ టైం గ్లోబల్ వేదికగా ప్రిస్టీజియస్ ప్రాజెక్టు గురించి అనౌన్స్ చేసి మహేష్ బాబు అభిమానులకు గూస్ బపంస్ తెప్పించారు.

మనకు తెలిసిందే దర్శక ధీరుడు ప్రజెంట్ యూఎస్ టూర్ లో ఉన్నాడు. ఆర్ఆర్ఆర్ సినిమా తర్వాత ప్రపంచ దేశాలకు టూర్ వేసిన రాజమౌళి ప్రజెంట్ అమెరికాలో ఫిలిం ఫెస్టివల్ లో ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. అక్కడ మీడియాతో మాట్లాడుతూ..తన నెక్స్ట్ ప్రెస్టీజియస్ ప్రాజెక్టు గురించి ఆసక్తికర విషయం రివిల్ చేశాడు. అఫ్ కోర్స్ ఈ విషయం గురించి అందరికీ తెలిసిందే ఆయన రాజమౌళి నోటి నుంచి ఆ మాట రావడంతో అభిమానులు హ్యాపీగా ఫీల్ అవుతున్నారు .

రాజమౌళి మాట్లాడుతూ..” ఎస్ నా నెక్స్ట్ సినిమా సూపర్ స్టార్ మహేష్ బాబుతో ఉంటుంది . ఈ చిత్రం గ్లోబల్ మొత్తం ట్రావెల్ అయ్యే విధంగా అడ్వెంచర్ మూవీగా ఉంటుంది. కచ్చితంగా ఈ సినిమాతో మహేష్ బాబుకి ఓ సపరేట్ ఇమేజ్ వస్తుందని ఆశపడుతున్నాను” అంటూ చెప్పుకొచ్చారు. దీంతో మహేష్ బాబు అభిమానులు ఫుల్ జోష్ లో ఉన్నారు . కాగా లోకల్ మీడియాలో ఇండియాలో మహేష్ బాబు గురించి ఎటువంటి ప్రకటన చేయని రాజమౌళి గ్లోబల్ మీడియాలో మహేష్ బాబు ఫిలిం అనౌన్స్ చేయడంతో సినీ ప్రముఖులు షాక్ అవుతున్నారు . నిజంగా రాజమౌళి ప్రమోషన్స్ తీరు , మైండ్ సెట్ కి ఫిదా అవ్వాల్సిందే అంటూ శభాష్ అనే కామెంట్స్ చేస్తున్నారు.

Share post:

Latest