వామ్మో.. సినిమాల కోసం వాళ్లే కమిట్మెంట్ ఆఫర్ ఇస్తున్నారట..!!

తెలుగు సినిమాతో పాటు దేశవ్యాప్తంగా హీరోయిన్లుగా ఎంపిక చేయాలి అంటే కచ్చితంగా కమిట్మెంట్లు అడిగేవారనే ఒకటాక్ ఇప్పటికీ వినిపిస్తూనే ఉన్నది. ఆమధ్య ఈ విషయం మీద చాలా చర్చలు కూడా జరిగాయి. దీంతో మీటు అనే ఒక ఉద్యమం కూడా జరిగింది. ఇక ఎంతోమంది ఇండస్ట్రీ నుంచి బయటికి వచ్చి తమకు జరిగిన కొన్ని అన్యాయాల గురించి కూడా తెలియజేయడం జరిగింది.. కానీ ఇప్పుడు రోజులు పూర్తిగా మారిపోయాయి ప్రస్తుతం ఉన్న పరిస్థితులలో అమ్మాయిలే కమిట్మెంట్లు ఆఫర్ చేస్తున్నారని కొత్త మాటలు వినిపిస్తూ ఉన్నాయి

ముఖ్యంగా ఫలానా సినిమా ఇచ్చిన ప్రధాన పాత్ర ఇచ్చిన కమిట్మెంట్ కు మేము సిద్ధంగానే ఉన్నాం అనే విషయాన్ని వాళ్ళే ముందుకు వెళ్లి చెబుతున్నట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం ఎక్కువగా తెలుగు సినీ ఇండస్ట్రీ మీద అందరూ దృష్టి పెడుతున్నారు మంచి విజయం అయితే చాలు తన నెక్స్ట్ సినిమాకు భారీగా రెమ్యూనరేషన్ వస్తుందనే నమ్మకంతో ఉన్నారు. ఇలాంటి వాటికి ఉదాహరణలుగా చాలానే చెప్పవచ్చు ఒక్క సినిమా హిట్ అయితే చాలు.. సోషల్ మీడియా మీద పలు వెబ్సైట్ల మీద దృష్టి పెడుతున్నారు.ఏ సమస్త ఏ సినిమా ప్లాన్ చేస్తూ ఉందో.. హీరో ఎవరు డైరెక్టర్ ఎవరు అనే విషయం తెలుసుకొని ఆపైన ఎవరికి ఆఫర్ ఇస్తే మనకు ఆఫర్ వస్తుందని విషయంపై పరిశోధన చేసి డేటా మొత్తం సేకరించుకుంటున్నారట.

ఇక ఏదైనా సినిమా చేస్తున్నారు కదా ఆ సినిమాలో హీరోయిన్ పాత్ర ఇస్తే మేము కమిట్మెంట్ కు సిద్ధమే అనే మెసేజ్లు కూడా పంపిస్తున్నారట. అయితే మన దర్శకులు నిర్మాతలు హీరోలు తెలివైన వారు.. తమ సినిమాకి తగిన కాస్టింగ్ అన్నదే ముఖ్యంగా చూస్తున్నారు తప్ప ఇలాంటి వాటికి లొంగడం లేదట. ఒకవేళ డబ్బులు బహుమతులు అయితే ఓకే కానీ సినిమాలు మాత్రం అడగొద్దని హింట్ కూడా ఇస్తున్నట్లు సమాచారం. మొత్తానికి యవ్వారం చూస్తే జంబలకడిపంబ సినిమానే గుర్తుకు వస్తోంది.