ఓకే సినిమాలో హీరో కం విలన్ గా నటించిన నటులు వీళ్లే..!!

సాధారణంగా ఒక సినిమాలో హీరో ద్విపాత్రాభినయం చేస్తున్నాడు అంటే దాదాపుగా అన్నదమ్ములు, తండ్రి కొడుకులు లాగే నటిస్తూ ఉంటారు. కానీ ఈ సినిమాలలో హీరోలు హీరోగా నటించడమే కాకుండా విలన్ గా కూడా నటించి మెప్పించారు. ఇక ఒకే సినిమాలో హీరో కం విలన్ గా నటించిన నటుల గురించి ఇప్పుడు ఒకసారి చదివి తెలుసుకుందాం.

జూనియర్ ఎన్టీఆర్:Jai Lava Kusa movie review: The biggest plus of this film is Jr NTR |  Entertainment News,The Indian Express
నటనకు నిలువెత్తు రూపం అయిన జూనియర్ ఎన్టీఆర్ గురించి మనం ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఇకపోతే ఈయన త్రి పాత్రాభినయం చేసిన జై లవకుశ సినిమాలో హీరోగా, విలన్ గా కూడా తానే నటించి తన నటనతో మెప్పించారు. ఈ సినిమా మంచి విజయాన్ని సొంతం చేసుకుంది.

విక్రమ్:Trailer Review: Inkokkadu - Kannada News - IndiaGlitz.com
తమిళ్ హీరో విక్రమ్ సైతం ఇలా తన సినిమాలో హీరోగా, విలన్ గా రెండు పాత్రల్లో నటించి మెప్పించాడు. ఇక ఎప్పుడు కూడా వైవిద్య భరితమైన సినిమాలు చేస్తూ ప్రేక్షకులను ఆకట్టుకునే ఈయన ఇలా ఒకే సినిమాలో హీరోగా విలన్ గా నటించి అదరగొట్టేశారు.

సూర్య:Surya's 24 Movie Story, Audio Release Date - WORLDHAB
24 సినిమాలో దిపాత్రాభినయం చేసిన సూర్య హీరోగా, విలన్ గా కూడా మెప్పించారు. ఇక ఈ సినిమా మంచి విజయాన్ని అందుకుంది.

బాలకృష్ణ:Nandamuri Balakrishna Rushed To The Hospital
ఎన్టీఆర్ నట వారసత్వాన్ని కొనసాగిస్తూ.. స్టార్ హీరోగా ఇండస్ట్రీలో కొనసాగుతున్న బాలకృష్ణ కూడా తన సినిమాలతో ప్రయోగాలు చేస్తూ ఉంటారు. ఈ క్రమంలోనే సుల్తాన్ సినిమాలో హీరోతో పాటు విలన్ పాత్రలో కూడా ఆయనే నటించి ప్రేక్షకులను మెప్పించాడు.

గోపీచంద్:
గౌతమ్ నంద సినిమాలో గోపీచంద్ హీరోగా , విలన్ గా నటించి ప్రేక్షకులను మరింతగా అలరించారు. ఇక నిజానికి గోపీచంద్ విలన్ గానే తన కెరియర్ ను మొదలుపెట్టారు. కానీ కొన్ని పరిస్థితుల రీత్యా హీరోగా తన ప్రయాణాన్ని మార్చుకున్నప్పటికీ పెద్దగా సక్సెస్ పొందలేకపోయాడు.

ఇక వీరితోపాటు మరింత మంది హీరోలు కూడా తమ సినిమాలలో హీరోగా, విలన్ గా నటించి మెప్పించడం జరిగింది.

Share post:

Latest