దాసరి – ఏఎన్నార్ మధ్య విభేదాలు రావడానికి కారణం..?

లెజెండ్రీ దర్శకుడిగా గుర్తింపు తెచ్చుకున్న దాసరి నారాయణరావు గురించి మనం ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఆయన కేవలం దర్శకుడు మాత్రమే కాదు నిర్మాతగా, నటుడిగా ఇండస్ట్రీకి పెద్ద దిక్కుగా కూడా బాధ్యతలు నెరవేర్చారు దాసరి నారాయణరావు ఇక ఆయన మరణించిన తర్వాత కూడా తెలుగు సినీ పరిశ్రమకు పెద్దదిక్కు లేకుండా పోయారని చెప్పడంలో సందేహం లేదు. దీన్ని బట్టి చూస్తే ఆయన ఇండస్ట్రీలో ఉండే కార్మికులకు , సినీ ప్రముఖులకు ఎంతలా దారి చూపించేవారో మనం అర్థం చేసుకోవచ్చు. ఇకపోతే దాసరి ఆరాధ్య దైవంగా భావించే వారిలో ఎన్టీఆర్ తర్వాత ఏఎన్ఆర్ అంతటి ప్రాధాన్యతను సంపాదించుకున్నారు.

దాసరి ఆరాధ్య నటుడు ఏఎన్ఆర్.. కానీ ఆయనతోనే విభేదాలు ఎందుకు తెలుసా
వీరిద్దరి కాంబినేషన్లో కూడా ఎన్నో సినిమాలు కూడా వచ్చాయి. ఇక దాసరి నారాయణరావు ఏదైనా సినిమా తీస్తున్నారు అంటే కచ్చితంగా ఆ సినిమాలో ఏదో ఒక ప్రత్యేకత ఉంటుంది అని ప్రేక్షకులు సైతం భావించేవారు. అలా ఎన్నో గొప్ప సినిమాలను లెజెండ్రీ దర్శకుడు దాసరి నారాయణరావు తెరకెక్కించారు అని చెప్పవచ్చు. ఇకపోతే ఇండస్ట్రీలో ఎంతోమందిని ప్రతిభావంతులుగా తీర్చిదిద్దిన దాసరి నారాయణరావును అందరూ గురువుగా భావించేవారు. అయితే దాసరికి అక్కినేని నాగేశ్వరరావు అంటే చాలా ఇష్టం.. అంతేకాదు తన ఆరాధ్య నటుడు అక్కినేని అని ఎన్నోసార్లు తెలిపారు. తాను చిత్ర పరిశ్రమలు కొనసాగడానికి కారణం అక్కినేని తో పాటు సావిత్రి కారణమంటూ ఎన్నోసార్లు మీడియా ముందే తెలియజేశారు.

దాస‌రికి - ఏఎన్నార్‌కు తొలి సినిమా నుంచే గొడ‌వ‌లు ఉన్నాయా ?

ఇకపోతే ఒకానొక సమయంలో అక్కినేని – దాసరి మధ్య విభేదాలు వచ్చాయి అది కూడా పారితోషకం విషయంలో కావడం గమనార్హం. డబ్బు ఎవరినైనా విడదీస్తుంది అని చెప్పడానికి ఇదే నిదర్శనం అని చెప్పవచ్చు. ఇకపోతే వీరి మధ్య బంధాన్ని కూడా ఆ డబ్బే విడదీసింది.. ఒకానొక సమయంలో ఏఎన్ఆర్ తో సమానంగా దాసరికి కూడా పారితోషకం ఇవ్వడంతో ఏఎన్నార్ తనతో ఒక మాట అన్నారట. ఆ మాట వల్ల మా ఇద్దరి మధ్య బంధం విడిపోయింది అంటూ దాసరి ఒక ఇంటర్వ్యూలో తెలియజేశారు. అలా డబ్బే వీరిద్దరి మధ్య శత్రుత్వాన్ని పెంచింది అని చెప్పవచ్చు.