రుద్రమదేవిలో గోన గన్నారెడ్డి పాత్ర మొదటగా ఎంతమంది హీరోల దగ్గరకు వెళ్లిందో తెలుసా?

గుణశేఖర్ దర్శకత్వంలో అనుష్క టైటిల్ రోల్ పోషించిన ‘రుద్రమదేవి’ సినిమాని తెలుగు ప్రేక్షకులు అంతత్వరగా మర్చిపోరు. ముఖ్యంగా ఈ సినిమాలోని అల్లు అర్జున్ పోషించిన గోన గన్నారెడ్డి పాత్రని మర్చిపోవడం ఇంకా కష్టం. అయితే ముందుగా ఈ చిత్రంలో గోనా గన్నారెడ్డి పాత్ర కోసం గుణశేఖర్ ముందుగా అనుకున్నది అల్లు అర్జున్ ని కాదని ఎంతమందికి తెలుసు. అవును… మొదటగా ఈ పాత్రకోసం గుణశేఖర్‌ తెలుగులో వున్న టాప్ హీరోల దగ్గరకు వెళ్ళాడట. ఇపుడు వాళ్లెవరో తెలుసుకుందాము…

కెరీర్ మొదటి నుంచి ఒక రకమైన చిత్రాలకు పరిమితం కాకుండా డిఫరెంట్ స్టైల్లో సినిమాలు తీసుకుంటూ పోతున్నాడు గుణశేఖర్. NTRతో రామాయణంతో పాటు అనుష్కతో ‘రుద్రమదేవి’ వంటి పౌరాణిక, చారిత్రక సినిమాలు చేసిన గుణశేఖర్ ఇపుడు రానాతో ‘హిరణ్యకశ్యప’ సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ‘రుద్రమదేవి’ సినిమాలో అల్లు అర్జున్ చేసిన గోనా గన్నారెడ్డి పాత్ర చెప్పిన “తెలుగు భాష లెక్క నేను ఈడా ఉంటా.. ఆడా ఉంటా” అని చెప్పిన డైలాగ్ అప్పట్లో బాగా ఫేమస్ అయింది.

రుద్రమదేవి సినిమాలో ముందుగా గోనా గన్నారెడ్డి పాత్ర చేయడానికి ముందుగా గుణశేఖర్ మహేష్ బాబుని ఆశ్రయించాడట. డేట్స్ సర్దుబాటు చేయలేకపోవడంతో అతను కాదన్నారు. ఆ తరువాత ఆ పాత్ర ఎన్టీఆర్ దగ్గరకు వెళ్లిందట. కానీ పరిస్థితులు అనుకూలించలేదు. ఆ తర్వాత అల్లు అర్జున్.. గోన గన్నారెడ్డి పాత్ర చేసినట్టు గుణశేఖర్ ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చాడు. ఇక ‘రుద్రమదేవి’ సినిమాకు గుణ శేఖర్ హాలీవుడ్ మూవీ ‘బ్రేవ్ హార్ట్’ సినిమా స్పూర్తి అని చెప్పడం హర్షణీయం.

Share post:

Latest