టీడీపీ గేమ్..అప్పుడే తేలుతుందా?

మొత్తానికి పొత్తుల విషయంలో టీడీపీ ఊహించని విధంగా మైండ్ గేమ్ ప్లే చేస్తున్నట్లు కనిపిస్తోంది…అధికార వైసీపీని కన్ఫ్యూజ్ చేయడానికి పొత్తులతో సరికొత్త ఎత్తులు వేస్తున్నట్లు తెలుస్తోంది. అయితే పొత్తులు ఉంటున్నాయని కథనాలు రావడం..ఆ వెంటనే ఇప్పుడే పొత్తుల గురించి మాట్లాడమని టీడీపీ అధినేత చెప్పడం వెనుక పెద్ద కథే ఉందని అర్ధమవుతుంది. వచ్చే ఎన్నికల్లో వైసీపీకి చెక్ పెట్టడానికి టీడీపీ-జనసేన పార్టీలు పొత్తుకు సిద్ధమవుతున్నాయని పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతున్న విషయం తెలిసిందే.

పైగా పొత్తు విషయంలో ఇటు చంద్రబాబు, అటు పవన్ పరోక్షంగా గ్రీన్ సిగ్నల్ ఇచ్చుకున్నారు. ఈ క్రమంలో వైసీపీ…రెండు పార్టీలపై ఎటాక్ మొదలుపెట్టింది. జగన్‌ని సింగిల్‌గా ఎదురుకునే దమ్ములేక ఇలా కలిసి వస్తున్నారని, ఎంతమంది కలిసిన జగన్‌ని ఓడించలేరని వైసీపీ నేతలు చెప్పుకొచ్చారు. పైగా జగన్ ఒంటరిగా పోరాడతారని ఓ రకమైన సెంటిమెంట్ లేపే ప్రయత్నం చేశారు.

దీంతో బాబు అలెర్ట్ అయ్యారు…వైసీపీపై వ్యతిరేకత మొదలైందని, వార్ వన్ సైడ్ అయిపోయిందని నెక్స్ట్ టీడీపీ అధికారంలోకి రాబోతుందని అన్నారు. అదే సమయంలో పవన్ సైతం…తమ పొత్తు ప్రజలతోనే అని చెప్పి…ఇప్పుడు పొత్తు కథనాలకు బ్రేక్ వేశారు. ఇదిలా ఉండగానే ఈ మధ్య మోదీ, చంద్రబాబు కలుసుకున్నారు. ఇక అక్కడ నుంచి మళ్ళీ ఎన్డీయేలోకి టీడీపీ వెళుతుందని పెద్ద ఎత్తున కథనాలు వస్తున్నాయి. నేషనల్ మీడియాలో వచ్చే కథనాలని టీడీపీ అనుకూల మీడియా ప్రచారం చేస్తుంది.

ఇక ఎన్డీయేలోకి టీడీపీ వెళితే రాజకీయంగా వైసీపీకి ఇబ్బంది…అయితే దీనికి కౌంటర్ ఎటాక్ వైసీపీ ఇవ్వడం మొదలుపెట్టింది..దీంతో ఎన్డీయేలోకి టీడీపీ చేరబోతుందనే వార్తలు వేసే వారే దానికి సమాధానం చెప్పాలని బాబు తెలివిగా సమాధానం ఇచ్చారు. పొత్తుపై తాను ఇప్పుడే ఏమి మాట్లాడనని అన్నారు. అంటే ఓవరాల్ గా చూసుకుంటే జనసేన-బీజేపీలతో టీడీపీకి పొత్తు ఉంటుందని..కానీ ఇప్పుడు పొత్తు గురించి మాట్లాడరు…ఎన్నికల సమయంలోనే పొత్తుల చర్చలు నడవనున్నాయి.