సర్వే: సిక్కొలులో కొత్త లెక్కలు ఇవే..!

ఏపీ రాజకీయ సమీకరణాలు అనూహ్యంగా మారుతున్నాయి. ఇప్పటివరకు అన్నీ జిల్లాల్లోనూ వైసీపీ ఆధిపత్యం నడిచింది…గత ఎన్నికల్లో అన్నీ జిల్లాల్లో వైసీపీ మెజారిటీ సీట్లు గెలుచుకున్న విషయం తెలిసిందే…అయితే వైసీపీ ప్రభుత్వం వచ్చి మూడేళ్లు దాటింది…ఈ క్రమంలో పలు జిల్లాలో వైసీపీ లీడ్ నిదానంగా తగ్గుతూ వస్తుందని పలు సర్వేల్లో స్పష్టం అవుతుంది…అలా అని రాష్ట్ర స్థాయిలో వైసీపీ ఆధిక్యం భారీగా తగ్గలేదు.

కానీ కొన్ని జిల్లాల్లో వైసీపీ గ్రాఫ్ ఊహించని విధంగా పడిపోతుందని తెలుస్తోంది. ఇదే క్రమంలో ఇటీవల వచ్చిన ఆత్మసాక్షి సర్వేలో ఊహించని ఫలితాలు కనిపిస్తున్నాయి. జిల్లాల వారీగా సర్వేలు చేసి…ఎప్పటికప్పుడు అధికారికంగా ఆత్మసాక్షి సంస్థ సర్వేలు వదులుతుంది. తాజాగా శ్రీకాకుళం జిల్లాకు సంబంధించి ఓ సర్వే వదిలింది. ఉమ్మడి శ్రీకాకుళం జిల్లాలో వైసీపీ లీడ్ బాగా తగ్గిందని, టీడీపీ లీడ్ పెరిగిందని చెప్పింది.

గత ఎన్నికల్లో జిల్లాలో 10 సీట్లు ఉంటే వైసీపీ 8, టీడీపీ 2 సీట్లు గెలుచుకుంది. కానీ ఇప్పుడు లెక్కలు మారాయి. ఇప్పుడున్న పరిస్తితుల్లో టీడీపీ 6, వైసీపీ 2 చోట్ల గెలిచే అవకాశాలు ఉన్నాయని తెలిసింది. అలాగే రెండు చోట్ల పోటాపోటీ ఉందని తేల్చి చెప్పింది. అలాగే ఈ జిల్లాలో జనసేన ప్రభావం కాస్త తక్కువ అని చెప్పింది. ఇక టీడీపీ గెలుచుకునే సీట్లు వచ్చి…ఎచ్చెర్ల, ఆమదాలవలస, ఇచ్చాపురం, టెక్కలి, పాతపట్నం, రాజాం. అటు వైసీపీ గెలుచుకునే సీట్లు…శ్రీకాకుళం, పాలకొండ సీట్లు.

టఫ్ ఫైట్ ఉండే సీట్లు వచ్చి నరసన్నపేట, పలాస అని ఆత్మసాక్షి సర్వే చెప్పింది. అయితే నర్సన్నపేటలో 3 శాతం వైసీపీకే ఎడ్జ్ ఉందట…పలాసలో 2 శాతం టీడీపీకి ఎడ్జ్ ఉందని ఆత్మసాక్షి సర్వే చెప్పింది. ఈ సర్వేని ఆత్మసాక్షి అధికారికంగానే విడుదల చేసింది. మరి ఈ సర్వే ఎంతవరకు నిజమవుతుందో చూడాలి.