బాపట్లలో సైకిల్‌కే ఛాన్స్?

వైసీపీ ప్రభుత్వంపై వ్యతిరేకత పెరగడం కావొచ్చు….వైసీపీ ఎమ్మెల్యేలపై ప్రజా వ్యతిరేకత పెరగడం కావొచ్చు….అదే సమయంలో రాష్ట్ర స్థాయిలో ప్రతిపక్ష టీడీపీ పుంజుకోవడం, కొన్ని నియోజకవర్గాల్లో టీడీపీ నేతలు నిత్యం ప్రజల్లో తిరుగుతూ…ప్రజా సమస్యలపై పోరాటం చేయడం, పార్టీని బలోపేతం చేయడం లాంటి కార్యక్రమాలు చేయడం వల్ల..కొన్ని స్థానాల్లో వైసీపీ ఎమ్మెల్యేలని దాటి టీడీపీ నేతలు ఆధిక్యంలోకి వస్తున్నారు. అలా టీడీపీ ఆధిక్యంలోకి వస్తున్న స్థానాల్లో బాపట్ల కూడా కనిపిస్తోంది.

బాపట్ల అంటే ఇప్పుడు వైసీపీకి అనుకూలమైన స్థానం…ఎప్పుడో 1999 ఎన్నికల్లో ఇక్కడ టీడీపీ గెలిచింది…మళ్ళీ అక్కడ టీడీపీ గెలిచిన దాఖలాలు లేవు. అసలు బాపట్ల అసెంబ్లీలో టీడీపీ గెలిచిందే మూడు సార్లు…1985, 1994, 1999 ఎన్నికల్లో మాత్రమే గెలిచింది. ఇక 2004, 2009 ఎన్నికల్లో ఇక్కడ కాంగ్రెస్ సత్తా చాటింది. ఇక రాష్ట్రంలో టీడీపీ గాలి ఉన్న 2014 ఎన్నికల్లో ఇక్కడ వైసీపీ గెలిచింది. నెక్స్ట్ 2019 ఎన్నికల్లో కూడా కోనదే గెలుపు.

ఇలా వరుసగా రెండుసార్లు బాపట్లలో వైసీపీ జెండా ఎగిరింది..మరో మూడోసారి కూడా గెలిచి బాపట్లలో వైసీపీ హ్యాట్రిక్ కొడుతుందా? అంటే ఏమో డౌట్ అనే చెప్పొచ్చు. ఎందుకంటే ఇక్కడ అనూహ్యంగా టీడీపీ పుంజుకుంటుంది. ఇంతకాలం సరైన నాయకత్వం లేక టీడీపీకి గెలుపు దక్కలేదు గాని…ఈ సారి టీడీపీ నేత వేగేశన నరేంద్ర వర్మ సత్తా చాటేలా ఉన్నారు.

గత ఎన్నికల్లో ఓడిపోయిన అన్నం సతీశ్ టీడీపీని వీడటంతో…నరేంద్రని టీడీపీ ఇంచార్జ్‌గా పెట్టారు. ఇంచార్జ్‌గా ఉన్న దగ్గర నుంచి నరేంద్ర…నిత్యం నియోజకవర్గాల్లో పర్యటిస్తూ ప్రజల సమస్యలు తెలుసుకుంటూ, వాటిపై పోరాటం చేస్తున్నారు. అలాగే గ్రామ గ్రామంలో తిరుగుతూ…పార్టీని మళ్ళీ కింది స్థాయి నుంచి బలోపేతం చేసుకుంటూ వస్తున్నారు…పార్టీ కార్యక్రమాలని విజయవంతంగా నిర్వహిస్తున్నారు. తక్కువ కాలంలోనే బాపట్లలో నరేంద్ర మంచి పేరు తెచ్చుకున్నారు. అటు వైసీపీపై ప్రజా వ్యతిరేకత పెరగడం నరేంద్రకు బాగా కలిసొచ్చేలా ఉంది. ఎన్నికల వరకు నరేంద్ర ఇంకా కష్టపడితే బాపట్ల వైసీపీ నుంచి చేజారినట్లే.