నాకు ఆ వ్యాధి ఉంది… ఇన్నేళ్ల‌కు బ‌య‌ట పెట్టిన ప‌వ‌న్ క‌ళ్యాణ్‌…!

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా ప్రపంచవ్యాప్తంగా ఉన్న పవన్ కళ్యాణ్ అభిమానులు భారీ ఎత్తున బర్త్ డే వేడుకలు చేస్తున్నారు. ఇటు సినిమాలతో పాటు… అటు రాజకీయాల్లో పవన్ ఫుల్ బిజీగా ఉన్నారు. ప్రస్తుతం పవన్ చేతిలో రెండు మూడు సినిమాలు ఉన్నాయి. గత ఏడాది వకీల్ సాబ్ ఈ ఏడాది భీమ్లా నాయక్ సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చి మెప్పించిన పవన్ వచ్చే సంక్రాంతికి హరిహర వీరమల్లు సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు.

Pawan Kalyan Movies List From 1996 to 2022! - Allwikibiography.in

అలాగే తమిళంలో హిట్ అయిన వినోదయ సైతం సినిమా రీమేక్‌లో తన మేనల్లుడు సాయిధరమ్ తేజ్ తో కలిసి నటించేందుకు రెడీ అవుతున్నాడు. పవన్ పుట్టినరోజు సందర్భంగా పవను బ్లాక్ బస్టర్ జల్సా సినిమాను ప్రపంచవ్యాప్తంగా భారీ ఎత్తున సంచలన రికార్డులు సాధించినట్లు తెలుస్తోంది. ఈ సినిమా మ‌హేష్ రి రిలీజ్ పోకిరి రికార్డుల‌ను సైతం క్రాస్ చేసిన‌ట్టుగా తెలుస్తోంది. ఇక ప‌వ‌న్ బ‌ర్త్ డే సంద‌ర్భంగా ఇచ్చిన ఇంట‌ర్వ్యూలో ప‌లు ఆస‌క్తిక‌ర విష‌యాలు వెల్ల‌డించారు. త‌న చిన్న‌నాటి విష‌యాలు కూడా చెప్పాడు.

త‌న‌కు చిన్న‌ప్పుడు ఆస్త‌మా వ్యాధి ఉంద‌న్న ప‌వ‌న్‌.. దీంతో ఎక్కువుగా స్కూల్‌కు వెళ్ల‌కుండానే ఇంట్లోనే ఉండేవాడిని అని చెప్పాడు. అందుకే త‌న‌కు చ‌దువు కూడా స‌రిగ్గా అబ్బ‌లేద‌ని… ఎనిమిదో త‌ర‌గ‌తి వ‌ర‌కు కంటిన్యూగా ఫెయిల్ అవ్వ‌డం త‌న‌కు అల‌వాటు కావ‌డంతో ఇంట‌ర్ లో ఫెయిల్ అయినా త‌న‌కు పెద్ద ఇబ్బంది అనిపించ‌లేద‌ని ప‌వ‌న్ చెప్పాడు. ఇక చిన్న‌ప్పుడు త‌న‌కు ఎక్కువుగా స్నేహితులు కూడా లేర‌ని ప‌వ‌న్ చెప్పాడు. ఉన్న ఒక‌రిద్ద‌రికి త‌న ఆలోచ‌న‌లు స‌రిప‌డేవే కావ‌న్నాడు.