ఆ నొప్పిని నేను ప్రేమగా భరించాను.. కాజల్ అగర్వల్ ఎమోషనల్ కామెంట్స్

కాజల్ అగర్వాల్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అందం, అభినయమే కాకుండా తన నటనతో ఎంతో మంది అభిమానులను కూడగట్టుకుంది ఈ చందమామ. ఇక మగధీర సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న కాజల్ తర్వాత ఆమె కెరీర్ అనుకోని విధంగా మలుపు తిప్పింది. వరస సినిమాలతో బిజీ అయిపోయి అనతి కాలంలోనే స్టార్ హీరోయిన్ హోదా సంపాదించుకుంది. ఈ అమ్మడు స్టార్ హీరోల అందరి సరసన నటించి, తన అభిమానులు మెప్పించింది.

ఇక కాజల్ అగర్వాల్ ఇటీవల తన చిన్ననాటి స్నేహితుడు గౌతమ్ కిచ్లు ని పెళ్లి చేసుకున్న కాజల్ అగర్వాల్ ఓ బిడ్డకు జన్మనిచ్చింది. ఆ తర్వాత కాజల్ చాలా మారిపోయిందని చెప్పవచ్చు. తాజాగా ఫ్రీడం టు ఫీడ్ కార్యక్రమంలో పాల్గొన్న ఈ ముద్దుగుమ్మ మాట్లాడుతూ చాలా ఎమోషనల్ అయ్యింది.

నీల్ పుట్టిన తర్వాత నా ప్రాణం అంతా తన వద్దే ఉంది. తనను విడిచి పెట్టి షూటింగ్‌లకు వెళ్లడం చాలా కష్టతరంగా అనిపించేది అంటూ తన మాతృత్వపు ప్రేమను చాటింది. అలాగే నీల్ పుట్టిన తర్వాత నా పర్సనల్ లైఫ్, నా వర్క్ లైఫ్ బ్యాలెన్స్ చేయలేకపోయాను. నీల్‌నే నా ప్రపంచం అయ్యాడు అని పేర్కొంది. ఏ తల్లి అయినా సరే తన బిడ్డకు తానే పాలివ్వాలనుకుంటుంది. ఆ అనుభూతి మాటల్లో చెప్పలేనిది. కానీ ఆ సమయంలో చాలా నొప్పి వస్తుంటుంది. నా నీల్ కూడా పాలు తాగే సమయంలో చాలా నొప్పి వచ్చేది కానీ వాడిని చూస్తే ఆ నొప్పిని ఏం తెలియకపోయేది. ఆ పేయిన్‌ని ప్రేమగా భరించానంటూ తన అమ్మతనాన్ని కాజల్ అగర్వాల్ గొప్పగా చెబుతూ ఎమోషనల్ అయ్యింది. స్టార్ హీరోయిన్ అయ్యి.. ఓ బిడ్డకు జన్మనిచ్చిన తర్వాత కాజల్‌లో మార్పు చూసి తన అభిమానులు ఎంతో సంతోషిస్తున్నారు.అంతే కాకుండా కార్యక్రమంలో కాజల్ చెప్పిన మాటలు ప్రతి తల్లి హృదయాన్ని తాకాయి, అనడంలో సందేహం లేదు.