కంచుకోటలో సైకిల్‌కు బ్యాడ్ లక్!

తెలుగుదేశం పార్టీ కంచుకోటల్లో పశ్చిమ గోదావరి జిల్లాలోని కొవ్వూరు కూడా ఒకటి అని చెప్పొచ్చు..అసలు టీడీపీ ఓడిపోని నియోజకవర్గాల్లో ఇది ఒకటిగా ఉండేది. 1983 నుంచి ఇక్కడ టీడీపీ సత్తా చాటుతూనే ఉంది. 1999 ఎన్నికల్లోనే ఒకసారి ఓడిపోయింది. 2009లో ఎస్సీ రిజర్వడ్ స్థానంగా మారిన సరే ఇక్కడ టీడీపీ ఓడిపోలేదు. 2009, 2014 ఎన్నికల్లో వరుసగా గెలిచింది. కానీ 2019 ఎన్నికల నుంచి ఇక్కడ టీడీపీకి బ్యాడ్ టైమ్ స్టార్ట్ అయింది.

మళ్ళీ ఈ సీటు జవహర్‌కు ఇవ్వొద్దని చెప్పి…టీడీపీలోని మరో వర్గం చంద్రబాబుకు గట్టిగానే ఫిర్యాదు చేసింది…దీంతో బాబు ఆలోచించి..పాయకరావుపేటకు చెందిన అనితని కొవ్వూరులో, జవహర్‌ని తిరువూరులో నిలబెట్టారు. జగన్ వేవ్ లో ఇద్దరు ఓడిపోయారు. ఎన్నికలయ్యాక అనితని మళ్ళీ పాయకరావుపేట ఇంచార్జ్‌గా పంపేశారు. అటు తిరువూరులో దేవదత్‌ని ఇంచార్జ్‌గా పెట్టారు. కానీ కొవ్వూరులో ఇప్పటివరకు ఇంచార్జ్ పెట్టలేదు.

ఉండటానికి రాజమండ్రి పార్లమెంట్ అధ్యక్షుడు జవహర్ ఉన్నారు గాని, ఆయనకు కొవ్వూరులో మాత్రం ఛాన్స్ ఇవ్వడం లేదు. పార్లమెంట్ అధ్యక్షుడుగా ఉండటంతో ఎలాగోలా జవహర్…కొవ్వూరులో ఎంట్రీ ఇచ్చి రాజకీయం మొదలుపెట్టారు. అదే సమయంలో అక్కడ ఆయన వ్యతిరేక వర్గం కూడా యాక్టివ్ అయింది. గతంలో తమను వేధించిన జవహర్‌ను కొవ్వూరు నుంచి పంపించి వేసినా మరోసారి తమపై పెత్తనం చేయడానికి వచ్చారని చెప్పి…ఆయన వ్యతిరేక వర్గం…మరోమారు కొవ్వూరు సీటు మాత్రం జవహర్‌కు రాకుండా పావులు కదుపుతుంది.

అయితే కొవ్వూరు టీడీపీ నాయకుడు పెండ్యాల అచ్యుతరామయ్య మద్ధతు ఉన్న ఏ నేతకు సీటు ఇచ్చిన తాము పని చేయడానికి సిద్ధంగా ఉన్నామని జవహర్ వ్యతిరేక వర్గం చెబుతోంది…జవహర్‌కు మాత్రం  సీటు ఇవ్వొద్దని అంటున్నారు. ఇక గ్రూపు తగాదాలని సద్దుమనిగేలా చేయడంలో చంద్రబాబు విఫలమవుతున్నారు. ఇక ఈ రచ్చ ఎన్నికల వరకు సాగి…జవహర్‌కు సీటు ఇస్తే సొంత పార్టీ వాళ్లే ఓడించేలా ఉన్నారు. మొత్తానికి చూసుకుంటే కంచుకోటలో టీడీపీకి ఇంకా బ్యాడ్ లక్ కొనసాగుతూనే ఉంది.