హీరో ధ‌నుష్ వ‌దిన సోనియాకు రెండో పెళ్లా… చ‌క్క‌గా క్లారిటీ ఇచ్చేసింది..!

తమిళంలో ప్రముఖ దర్శకుడు సెల్వ రాఘవన్ మాజీ భార్యగా సోనియా అగర్వాల్ గతంలో వార్తల్లో నిలిచారు. `7జీ బృందావన్ కాలనీ` చిత్రంతో ఊహించని స్థాయిలో పాపులారిటీని సొంతం చేసుకుని ప్రేక్షకుల హృదయాల్లో స్థానం సంపాదించుకుంది. సోనియా అగర్వాల్ మాతృభాష పంజాబీ కాగా హీరో ధ‌నుష్ అన్న‌య్య దర్శకుడు సెల్వ రాఘవన్ ను వివాహం చేసుకోవడం ఆ తర్వాత కాలంలో భర్తతో మనస్ప‌ర్ధలు రావడంతో విడిపోవ‌డం జ‌రిగింది.

అయితే సోనియా అగర్వాల్ గత కొద్దికాలంగా సింగిల్‌గా ఉంటున్నారు. ఇక ఈమె మాత్రం రెండో పెళ్లి గురించి ఆలోచన చేయడం లేదు. అయితే ఇలాంటి పరిస్థితుల్లో సోనియా అగర్వాల్ పోస్టు చేసిన ఫోటోలు గురించి వార్తలు జోరుగా ప్రచారంలోకి వస్తున్నాయి. సోనియా అగర్వాల్ ఇటీవల తన చేతికి మెహందీ పెట్టుకొన్న ఫోటోలు షేర్ చేయ‌గా ప్ర‌స్తుతం ఆ ఫోటోలు నెట్టింట వైరల్ అయ్యాయి.

అయితే ఓ నెటిజన్ తనకు కలిగిన కుతుహలం కొద్ది.. మీరు మళ్లీ పెళ్లి చేసుకొంటున్నారా? అని అడిగ‌గా.. అయితే ఆ ప్రశ్నకు సోనియా అగర్వాల్ నవ్వుతూ.. ఇలా సింపుల్ గా మెహందీ పెట్టుకొని పెళ్లి చేసుకొంటానని అనుకొంటున్నారా ? నా పెళ్లి జరిగితే ఇంత తక్కువ మెహందీ నా చేతులకు ఉండదు సోనియా అగర్వాల్ వెల్లడించింది.

ఇప్పుడు ఆమె కామెంట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అలా పెళ్లిపై సోనియా అగర్వాల్ క్లారిటీ ఇచ్చారు. అయితే ప్రస్తుతానికి సోనియా అగర్వాల్ తమిళం, మలయాళం, తెలుగు భాషల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా అలాగే బుల్లితెరపై కొన్ని సీరియల్స్‌లో న‌టిస్తూ కెరీర్ ను కొనసాగిస్తున్నారు.

Share post:

Latest