సోమిరెడ్డి బ్యాడ్ లక్ కంటిన్యూ..!

టీడీపీలో ఉన్న సీనియర్ నేతల్లో సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డికి ఉన్న బ్యాడ్ లక్…మరొక నేతకు లేదనే చెప్పాలి. సాధారణంగా టీడీపీలో రెడ్డి వర్గం నేతలు తక్కువగానే కనిపిస్తారు..మొదట నుంచి పార్టీలో పనిచేస్తూ…చంద్రబాబుకు వీర విధేయుడుగా ఉన్న నేతల్లో సోమిరెడ్డి ముందు వరుసలో ఉంటారని చెప్పొచ్చు. రెడ్డి వర్గానికి చెందిన సోమిరెడ్డి…మొదట నుంచి పార్టీలో కష్టపడుతూనే వస్తున్నారు.

ఇక ఎంత కష్టపడిన సరే ఈయనకు విజయాలు మాత్రం దక్కవు. ఏదో 1994, 1999 ఎన్నికల్లోనే సర్వేపల్లిలో సోమిరెడ్డి గెలిచారు. ఆ తర్వాత నుంచి సోమిరెడ్డికి ఓటములే. అయితే ఈయన గాని పార్టీ మారి ఉంటే విజయం దక్కేది…కానీ సోమిరెడ్డి టీడీపీలో నిబద్ధత పనిచేసే నాయకుడు. అందుకే ఓటములు వచ్చినా అలాగే పార్టీలో నిలబడ్డారు. వరుసగా 2004, 2009, 2014, 2019 ఎన్నికల్లో సర్వేపల్లిలో ఓడిపోయారు. మధ్యలో బంపర్ ఆఫర్ అన్నట్లు 2012 కోవూరు ఉపఎన్నికలో పోటీ చేసి ఓడిపోయారు.

ఇలా అయిదుసార్లు సోమిరెడ్డికి బ్యాడ్ లక్ నడిచింది…సరే ఇకనైనా సోమిరెడ్డికి టైమ్ బాగుటుంటుందా? అంటే ప్రస్తుతం సర్వేపల్లిలో పరిస్తితి అలా కనిపించడం లేదు. ఇటీవల వస్తున్న సర్వేల్లో కూడా సర్వేపల్లిలో వైసీపీకే గెలుపు అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది. ఇటీవల వచ్చిన శ్రీ ఆత్మసాక్షి సర్వేలో కూడా…సర్వేపల్లిలో మళ్ళీ సోమిరెడ్డికి గెలుపు అవకాశాలు లేవని తేలింది.

సరే ఇదొక ఇబ్బంది అనుకుంటే…అసలు నెక్స్ట్ సీటు దక్కుతుందా లేదా? అనేది మరొక టెన్షన్. ఎందుకంటే ఆ మధ్య వరుసగా మూడుసార్లు ఓడిపోయిన వారికి సీట్లు ఇచ్చే ఛాన్స్ లేదని లోకేష్ చెప్పారు. తాజాగా యువతకు 40 సీట్లు ఇస్తామని, సీనియర్లు ఏం అనుకోవద్దని బాబు చెప్పేశారు. దీంతో సోమిరెడ్డికి పెద్ద కష్టమే వచ్చి పడింది. సరే ఆయనకు సీటు ఇవ్వకపోతే…పోనీ ఆయన వారసుడుకు సీటు ఇస్తే బాగానే ఉంటుంది…మరి చూడాలి ఈ సారైనా సోమిరెడ్డికి బ్యాడ్ లక్ పోతుందేమో.

Share post:

Latest