సూర్యతో కలిసి భారీ మూవీ ప్లాన్ చేస్తున్న శంకర్.. ఇక బాక్స్ బద్దలే!

తమిళ్ డైరెక్టర్ శంకర్ షణ్ముగం తీసిన చాలా సినిమాలు ప్రేక్షకులను ఎంతగానో అలరించాయి. ముఖ్యంగా అపరిచితుడు, బాయ్స్, భారతీయుడు వంటి చిత్రాలు ప్రేక్షకులను ఆలోచింపజేశాయి. శంకర్ సోషల్ మెసేజ్‌లతో పవర్-ప్యాక్డ్ యాక్షన్ ఎంటర్‌టైనర్లు అందించి ఇప్పటికే టాప్ డైరెక్టర్లలో ఒకరిగా నిలిచారు. అద్భుతమైన సినిమాలతో అవినీతి, ఇతర సాంఘిక దురాచారాలకు వ్యతిరేకంగా ప్రజలను ఉత్తేజపరిచిన దర్శకుడిగా మారారు. ప్రస్తుతం ఈ దిగ్గజ డైరెక్టర్ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా RC15, కమల్ హాసన్‌ హీరోగా ఇండియన్ 2 సినిమాలు డైరెక్ట్ చేస్తున్నాడు. ఇవి రెండూ హై ప్రొఫైల్, మోస్ట్ ఎవైటెడ్ మూవీలు అని చెప్పవచ్చు. ఈ నేపథ్యంలోనే అతని మరో అప్‌కమింగ్ ఫిల్మ్ గురించి వార్తలు వస్తున్నాయి.

శంకర్ ఇప్పుడు సూర్యతో కలసి రూ.1,000 కోట్ల బడ్జెట్‌తో ఒక భారీ మూవీ ప్లాన్ చేస్తున్నాడని వార్తలు వస్తున్నాయి. శంకర్ సూర్యకి ఓ ఇంట్రెస్టింగ్ స్టోరీ చెప్పాడని, దానికి సూర్య గ్రీన్ సిగ్నల్ కూడా ఇచ్చాడని టాక్. ఈ ప్రాజెక్ట్‌ను సూర్య తన సొంత బ్యానర్‌పై ప్రొడ్యూస్ చేయనున్నాడని సమాచారం. వెంకటేశన్ రచించిన వేల్పారి నవల ఆధారంగా ఈ సినిమా తెరకెక్కుతోందని సన్నిహితులు చెబుతున్నారు. ఈ నవల ఆనంద వికటన్‌లో 100 వారాల పాటు ప్రచురితమై పాఠకులను ఉర్రూతలూగించింది. ఈ నవల హక్కులను సూర్య సొంతం చేసుకున్నాడు. శంకర్ ఈ నవలను సినిమాగా మార్చబోతున్నాడు.

శంకర్ బాలీవుడ్ స్టార్ రణ్‌వీర్ సింగ్‌తో ఒక సినిమా కమిట్ అయ్యాడు. ఇక సూర్య వణంగాన్‌.. వెట్రిమారన్ వాడివాసల్.. ఆది నారాయణతో మరో బహుభాషా సినిమా చేస్తున్నాడు. సూర్య మంచి యాక్టర్ కాబట్టి శంకర్ మంచి కథతో సినిమా తీస్తే అది పాన్ ఇండియా లెవల్లో బ్లాక్ బస్టర్ హిట్టయ్యే అవకాశముంది. శంకర్ ఇటీవల కాలంలో ఐ, 2.0 సినిమాలు తీశారు కానీ అవి రెండూ అతనికి హిట్ తెచ్చి పెట్టలేదు. దాంతో ఇండియన్ 2, RC15 సినిమాలతో తన సత్తా చాటుకోవడం శంకర్‌కి అత్యవసరంగా మారింది.

Share post:

Latest