బాలయ్యతో ఆ హీరోయిన్ కాళ్లు మొక్కించిన ఎన్టీఆర్.. ఎందుకో తెలుసా?

తెలుగు సినిమా స్థాయిని పెంచిన గొప్ప నటుడు నందమూరి తారక రామారావు. క్లాస్, మాస్ అనే తేడా లేకుండా సినిమాలు తీశారు. ఇక పౌరాణిక చిత్రాలకు ఆయన కేరాఫ్ అడ్రస్ గా నిలిచారు. చాలా మంది రాముడు, శ్రీకృష్ణుడు అంటే రామారావు వేసిన గెటప్ లనే చూపిస్తారు.. అంతటి మహానటుడు ఎంతో సాధారణంగా ఉండేవారు. పెద్ద స్టార్ అయినప్పటికీ ప్రతి ఒక్కరిని గౌరవించేవారు. తన మాటలతో ఎవరినీ ఇబ్బంది పెట్టలేదు. ఇక తన కంటే చిన్న వయస్సు ఉన్న హీరోయిన్లను గౌరవించేవారట.. ఇక ఎన్టీఆర్ వారసుడిగా నందమూరి బాలకృష్ణ ఇండస్ట్రీకి పరిచయమయ్యారు. తండ్రికి తగ్గ తనయుడిగా బాలయ్య నిరూపించుకున్నారు. అయితే కెరీర్ మొదట్లో ఓ సినిమా చేస్తున్న సమయంలో బాలకృష్ణకు ఎన్టీఆర్ మూడు షరతులు పెట్టారట.

బాలకృష్ణ హీరోగా కోడి రామకృష్ణ దర్శకత్వంలో మంగమ్మగారి మనవడు వచ్చిన సంగతి తెలిసిందే..అప్పట్లో ఆ సినిమా ఎంత పెద్ద హిట్ అయ్యింది. ఈ సినిమా గురించి ఓ ఆసక్తికర విషయం ఇప్పుడు వైరల్ అవుతోంది.. ఈ సినిమా తీసేందుకు మొదట స్టోరీని సీనియర్ ఎన్టీఆర్ కి వినిపించారట. కానీ ఆ స్టోరీ ఎన్టీఆర్ కి నచ్చలేదు. అదే స్టోరీని బాలకృష్ణకు చెప్పారట.. అయితే బాలయ్యకు మాత్రం ఈ కథ నచ్చింది. దీంతో తన తండ్రికి మరోసారి స్టోరి వినాలని కోరారట..

ఆ స్టోరిని విన్న ఎన్టీఆర్ ఓకే చెప్పారట.. ఈ సినిమాలో బామ్మ పాత్ర కోసం భానుమతి గారిని తీసుకోవాలని అనుకున్నారు. కానీ సినిమాలో నటించడానికి భానుమతి అంగీకరించలేదట. దీంతో ఎన్టీఆర్ రంగంలో దిగారట. భానుమతికి ఫోన్ చేసి సినిమాలో నటించడానికి ఒప్పించారట.. అయితే సినిమా చేసే సమయంలో బాలకృష్ణ మూడు కండీషన్లు పెట్టారట ఎన్టీఆర్.. భానుమతి షూటింగ్ సెట్ కి వచ్చే అరగంట ముందే బాలకృష్ణను షూటింగ్ స్పాట్ లో ఉండాలని, బానుమతి రాగానే కారు దగ్గరకు వెళ్లి డోర్ తీయాలని, ఆమె కారు నుంచి దిగగానే భానుమతి గారి కాళ్లకు నమస్కారం చేయాలని ఎన్టీఆర్ చెప్పారట.. దీంతో బాలకృష్ణ అలానే చేశారట.. ఇది గమనించిన భానుమతి మీ నాన్న నీకు ఇలా చేయాలని చెప్పారా అని అడిగారట. నీకు పెద్ద వారిని గౌరవించే లక్షణం ఉందని, పైకి వస్తావని బాలకృష్ణను మెచ్చుకున్నారట..

Share post:

Latest