ప‌వ‌న్ క‌ళ్యాణ్ మూడు పెళ్లిళ్ల సీక్రెట్ ఇదే….!

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అనే ఈ పేరుకు రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎంత క్రేజ్ ఉందో తెలిసిందే. పవన్ కళ్యాణ్ ఓ వైపు సినిమాల్లో నటిస్తూనే మరోవైపు రాజకీయాల్లో కూడా కీలకంగా వ్య‌వ‌హ‌రిస్తున్నారు. ఎలాగైనా ఈ సారి వచ్చే ఎలక్షన్స్ లో సీఎం గా గెలిచి జనసేన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడమే ప్ర‌ధ‌మ లక్ష్యంగా ప‌వ‌న్‌ గట్టి కృషి చేస్తున్నార‌న్న సంగ‌తి తెలిసిందే. ఇక ఈయనకి మాములు ఫ్యాన్ ఫాలోయింగ్ లేదు. పవన్ ను చాలా మంది అభిమానిస్తే మ‌రి కొంత మంది మాత్రం విమర్శిస్తారు. అందులో మొద‌టిది మాత్రం పవన్ మూడు పెళ్లిళ్ల గురించే ఎక్కువగా విమర్శిస్తూ ఉంటారు. అయితే పవన్ కళ్యాణ్ మూడు పెళ్లిళ్లు చేసుకోవ‌డానికి గ‌ల కారణాలు చూద్దాం.

పవన్ కళ్యాణ్ మొదట నందిని అనే వైజాగ్ కి చెందిన అమ్మాయిని 1997 మే 17 న వివాహం చేసుకున్నారు. ఆ తరవాత వీరిద్దరి మధ్య చిన్న చిన్న విభేధాలు వస్తూ ఉండేవట. అలా చిన్న గొడవలు పెరిగి పెద్దై చివరికి ఇద్దరూ పరస్పర ఒప్పందంతో విడాకులు తీసుకున్నారు. కానీ ఆ టైంలో చిరంజీవి ఫ్యామిలీ ఎంత న‌చ్చ‌చెప్పడానికి ప్ర‌య‌త్నించిన‌ కూడా ఈ జంట కలిసి జీవించ‌లేక పోయారట. ఇక ఆ తర్వాత పవన్ కళ్యాణ్ తనతో కలిసి బద్రి సినిమాలో హీరోయిన్గా నటించిన రేణు దేశాయ్ ని ప్రేమించి 2009 లో జనవరి 28 న పెళ్లి చేసుకున్నాడు.

వీరికి ఇద్దరు పిల్లలు అఖిరా నందన్, .కుమార్తె ఆరాధ్య జ‌న్మించారు. కానీ కొన్ని రోజులకు రేణుదేశాయ్‌కు ప‌వ‌న్‌కు గ్యాప్ వ‌చ్చింది. ఈ గ్యాప్‌న‌కు కార‌ణం పవన్ కళ్యాణ్ లో ఉండే మంచితనమే కార‌ణం అని అంటుంటారు. పవన్ కళ్యాణ్ దగ్గరికి వచ్చి ఎవరు చేయి చాచి తమ బాధలను చెప్పుకుంటే…వారికి వెంటనే ఆర్థికంగా సాయం చేసేస్తారు. అంతేకాకుండా పవన్ కళ్యాణ్ అలా అంద‌రికి సహాయం చేసి చాలా విలువైన ఆస్తులు పోగొట్టుకున్నాడు. అంతేకాకుండా అన్నయ్య నాగబాబు కష్టాల్లో ఉన్న సమయంలో పవన్ త‌న అన్నయ్య కోసం ఒక ఇల్లును కూడా అమ్మేసాడు. ఆ ర‌కంగా ఆర్దికంగా అన్నయ్య నాగ బాబుకు సహాయం చేశారట ప‌వ‌న్.

ఇక ఈ విషయంలో పవన్ క్యారెక్టర్ రేణుదేశాయ్ కి నచ్చక అందరికీ ఇస్తూ పోతే మన పిల్లలకు ఏముంటుంది అంటూ తరచూ గా గొడ‌వ‌ప‌డేవార‌ట‌.. దీంతో ఇద్దరూ విడాకులు తీసుకోవడం మంచిదని ఫైనల్ గా డైవర్స్ తీసుకుని ఎవరి బ్రతుకు వారు బ్రతుకుతున్నారు. ఆ తర్వాత రష్యాకు చెందిన ఇంగ్లీష్ సినిమాల్లో నటించే అన్న లెజీవా ని 2013 సెప్టెంబర్ 30 న పెళ్లి చేసుకున్నారు పవర్ స్టార్. పవన్ కళ్యాణ్ లాగే లెజీవాకు కూడా దాన గుణం ఎక్కువ అట‌. అలా దానాలు చేసి ఈమె కూడా ఎన్నో ఆస్తులు పోగొట్టుకుంద‌ని అంటారు.

Share post:

Latest