నటుడు జయప్రకాశ్ రెడ్డి మృతికి కారణం అదేనా … కోట్ల కొలది డబ్బుని పోగొట్టుకోవడానికి కారణం ఇదే!

నటుడు జయప్రకాశ్ రెడ్డి అంటే ఎవరో తెలియని తెలుగు ప్రేక్షకులు ఉండరనే చెప్పుకోవాలి. సమరసింహారెడ్డి అనే సినిమాతో వెండితెరకు పరిచయం అయిన జయప్రకాశ్ రెడ్డి అనతికాలంలోనే మంచి క్యారెక్టర్ ఆర్టిస్టుగా పేరు తెచ్చుకున్నాడు. ఈ క్రమంలో ఓ కరడు కట్టిన విలన్ గా మంచి పేరు సంపాదించుకున్నాడు. ఆ తరువాత విచిత్రంగా కమెడియన్ పాత్రలలో మెప్పించాడు నటుడు జయప్రకాశ్ రెడ్డి. అలా దాదాపు సహాయ పాత్రలలో 100 చిత్రాల పై చిలుకు నటించాడు. ఈయన కర్నూలు జిల్లా, శిరివెళ్ళ మండలంలోని వీరారెడ్డి పల్లి గ్రామంలోని వ్యవసాయ కుటుంబంలో 1946, మే 8న జన్మించాడు.

ఇకపోతే జయప్రకాశ్ రెడ్డి చివరి రోజుల్లో చాలా ఇబ్బందులు పడ్డారని ఆయన సన్నిహితులు చెబుతూ వుంటారు. అయితే అన్ని సినిమాలలో నటించినా కష్టాలు ఆయన్ని విడలేదా? అనే అనుమానం కలగక మానదు. ఇక జయప్రకాశ్ రెడ్డి సినిమాలలోకి రాకముందు పలు విద్యా సంస్థలలో పనిచేసారు. సరిగ్గా ఆ సమయంలోనే సినిమా అవకాశం రావడంతో సదరు వుద్యోగం వదులు కున్నాడు. అయితే అతని శ్రేయోభిలాషులు జయప్రకాశ్ రెడ్డి సినిమాలలో రాకుండా వున్నపుడే సంతోషంగా ఉండేవాడని అంటూ వుంటారు.

ఇతను నటించగా వచ్చిన డబ్బుని ఎక్కువ శాతం నమ్మినవారికి ఇచ్చేవాడని, వారే అతన్ని నట్టేటా ముంచేశారని గుసగుసలు వినబడుతున్నాయి. అందుకే అతను చివర రోజుల్లో డబ్బుకి కాస్త ఇబ్బంది పడ్డారని టాక్ నడుస్తోంది. ఏది ఏమైనా తెలుగు పరిశ్రమ మంచి నటుడుని కోల్పోయిందనే విషయం జీర్ణించుకోలేనిది. ఇక జయ ప్రకాష్ రెడ్డికి చిన్నప్పటి నుంచే నాటకాలంటే ఆసక్తి ఉండేది. దానివల్లనే అతను తన ఉపాధ్యాయ వృత్తికి ఫుల్ స్టాప్ పెట్టడం జరిగింది.

Share post:

Latest