చిరంజీవి – సురేఖల పెళ్లి ఎలా జరిగిందో తెలుసా? పెద్ద కధే జరిగింది!

తెలుగు చిత్ర సీమలో మెగాస్టార్ చిరంజీవి స్థానం ఎలాంటిదో వేరే చెప్పాల్సిన పనిలేదు. అతని పేరు చెబితే టాలీవుడ్ పులకిస్తుంది. క్రమశిక్షణకి మారుపేరు మెగాస్టార్ చిరంజీవి అని వేరే చెప్పాల్సిన పనిలేదు. సినిమా అంటేనే రంగురంగుల ప్రపంచం. దాదాపు ఇక్కడ అందరు ప్రేమ వివాహాలు చేసుకుంటూ వుంటారు. అలాంటిది మెగాస్టార్ చిరంజీవి పెద్దలు కుదిర్చిన వివాహం చేసుకున్నాడని ఎంతమందికి తెలుసు? ఆయన అల్లు రామలింగయ్య కుమార్తెను పెళ్లి చేసుకునే సమయానికి పెద్దగా స్టార్ ఇమేజ్ లేదు.

అల్లు రామలింగయ్య అప్పటికే స్టార్ కమెడియన్. గీతా ఆర్ట్స్ అనే బ్యానర్ కూడా ఉంది. అప్పుడు చిన్న చిన్న పాత్రలు మాత్రమే వేస్తున్నారు చిరంజీవి. కానీ చిరంజీవిని చూసిన అల్లు రామలింగయ్య తన కుమార్తెను పెళ్లి చేసుకుంటావా? అని డైరెక్ట్ గా అడిగారట. ఇక ఆ తర్వాత చిరంజీవి తల్లి తండ్రులు వెళ్లి సురేఖను చూసి వచ్చారు. చిరంజీవిని ఒక సినిమా కార్యక్రమంలో చూసిన సురేఖ వెంటనే ఒకే చెప్పారు. అయితే అప్పటికే కలెక్టర్ గా ఉన్న ప్రభుత్వ ఉద్యోగి ఒకరు సురేఖను పెళ్లి చేసుకుందాం అనుకున్నారు.

ఆ విషయాన్ని అల్లు రామలింగయ్యను అడగడంతో… ఆయనకు ఏం చేయాలో అర్ధం కాలేదు. వెంటనే తన సన్నిహితుడు, నటుడు ప్రభాకర్ రెడ్డిని అడిగారు. ఏం చేయాలని సలహా అడిగితే అమ్మాయి ఇష్టప్రకారం చేయండి… కలిసి ఉండేది ఆ ఇద్దరు కాబట్టి వారి ఇష్ట ప్రకారం ముందుకు వెళ్ళండి అన్నారట. సురేఖ కూడా చిరంజీవినే చేసుకుంటా అన్నారట. దీనితో చిరంజీవితో సురేఖ పెళ్లి చేసారు. 1980లో ఈ వివాహం జరిగింది. అక్కడి నుంచి చిరంజీవి పెద్ద స్టార్ అయిపోయారు. వరుస హిట్ లు వచ్చాయి. గీతా ఆర్ట్స్ బ్యానర్ లో చిరంజీవి ఎన్నో సినిమాలు హీరోగా చేసారు.

Share post:

Latest