హిట్ కొట్టేలా ఉన్న సమంత యశోద టీజర్..!

దక్షిణాది సినీ ఇండస్ట్రీలో సమంత సినిమా కోసం ఎంతోమంది ప్రేక్షకులు చాలా ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. దాదాపుగా ఈమె నుండి సినిమా రాక రెండు సంవత్సరాలు పైనే అవుతుంది. ఇక తాజాగా ఈమె నటించిన యశోద సినిమా విడుదలకు సిద్ధంగా ఉన్నది. దీంతో ఈ సినిమా ప్రమోషన్స్ ను కూడా చిత్ర బృందం వేగవంతంగా చేస్తున్నారు. ఇక కేవలం ఈ సినిమా చివరి పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో ఉన్నది. యశోద సినిమా నుంచి ఇప్పటివరకు విడుదలైన ఫస్ట్ లుక్ పోస్టర్స్, గ్లింప్స్ ప్రేక్షకులకు బాగా ఆసక్తి కలిగించాయి. ఈ క్రమంలోని ఈ రోజు కొన్ని గంటల క్రితం ఈ సినిమాకు సంబంధించి టీజర్ ను విడుదల చేశారు.

Samantha Ruth Prabhu's 'Yashoda' countdown begins, teaser to release on  September 9

సమంత ఈ చిత్రంలో యశోద అనే పాత్రలో నటించబోతోంది. ఇక అంతే కాకుండా గర్భిణీ స్త్రీ పాత్రలో కూడా సమంత పరిచయం చేయడంతో ఈ టీజర్ మరింత ఆసక్తి కలుగుతుంది. ప్రెగ్నెంట్ సమయంలో మహిళలు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో డాక్టర్ చెబుతూ ఉండగా అందుకు పూర్తి భిన్నంగా ఆమె లైఫ్ లో ఊహించని సంఘటనలు జరుగుతూ ఉన్నట్లుగా ఈ టీజర్ లో చూపించడం జరుగుతోంది. అయితే ఆమె బిడ్డను జన్మనివ్వకుండా ఎవరూ అడ్డుపడుతూ ఉన్నట్లుగా ఈ సినిమా టీజర్ ని చూస్తే మనకు క్లియర్ గా అర్థమవుతోంది. మరి అలాంటి వాటి నుంచి సమంత ఎలా బయటపడుతుంది అనే కథాంశం తో ఈ చిత్రం తెరకెక్కించడం జరుగుతోంది డైరెక్టర్ హరి హరీష్.

ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించి టీజర్ వైరల్ గా మారుతోంది. ఇక ఈ చిత్రంలో ఎమోషనల్ తో పాటు ఉత్కంఠ భరిచే థ్రిల్ కి కూడా గురిచేసేలా కనిపిస్తోంది. ఈ సినిమా విజువల్ బ్యాక్ గ్రౌండ్ కూడా ఈ సినిమాకు మరింత అద్భుతంగా చేకూర్చేలా కనిపిస్తున్నాయి. సమంత ఎప్పటిలాగానే తనదైన నటనతో ఈ సినిమాలో ఆకట్టుకునేలా కనిపిస్తోంది. వరలక్ష్మి శరత్ కుమార్, రావు రమేష్ , సంపత్ రాజ్ తదితరులు నటిస్తున్నారు. ఈ చిత్రంతో సమంత కచ్చితంగా సక్సెస్ అవుతుందనే నమ్మకాన్ని తెలియజేస్తున్నారు అభిమానులు.

Share post:

Latest