వైసీపీ అధినేత, సీఎం జగన్ యాక్షన్ అనగానే.. ఆ పార్టీ నాయకులు.. మంత్రులు రియాక్షన్ ప్రారంభించే శారు. ఇది మంచిదే.. అధినేత చెప్పిమాటను పాటించడం.. అందరికీ మంచి పరిణామమే. కానీ, ఇక్కడే ఉంది.. మరో కిటుకు.. ప్రస్తుతం జగన్ చెప్పిన యాక్షన్‌తో నేతలకు ఎలాంటి ఇబ్బందీ లేదు. అంతేకాదు.. రూపాయి ఖర్చు కూడాలేదు. దీంతో వారంతా కూడా.. రెడీ అయిపోతున్నారు.మరి ఈ దూకుడు ప్రజల మధ్యకు వెళ్లమంటే మాత్రం.. ఎందుకు ఉండడం లేనేది ప్రశ్న.
ఇక, విషయంలోకి వెళ్తే.. జగన్ ఇటీవల మంత్రి వర్గ సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా మంత్రు లకు తలంటినంత పనిచేశారు. “నన్ను నా కుటుంబాన్ని ప్రతిపక్షాలు నోరు చేసుకుంటున్నాయి. అనరా ని మాటలు అంటున్నాయి. అయినా.. మీరు మాత్రం పట్టించుకోవడం లేదు.ఇలా అయితే.. ఎలా? టీడీపీలో చంద్రబాబు ఏదైనా అంటే.. కింది స్థాయి వరకు నాయకులు నాపై విరుచుకుపడుతున్నారు. మరి మీరేం చేస్తున్నారు?“ అని జగన్ నిలదీశారు.
దీంతో తత్వం బోధపడిన వైసీపీ మంత్రులు.. ఇతర నాయకులు.. వెంటనే రీజార్జ్ అయ్యారు. తాజాగా మంత్రి మేరుగ నాగార్జున.. ఎప్పుడూ లేనిది.. నారా లోకేష్‌పై విరుచుకుపడ్డారు. అదే సమయంలో వైఎస్ జగన్ తాత రాజారెడ్డి ఈ దేశానికి ఆణిముత్యాల్లాంటి పిల్లలను అప్పగించారని.. అన్నారు. ఇక, చంద్రబా బు పప్పుసుద్దను ఇచ్చారని.. వ్యాఖ్యానించారు. ఇక, మాజీ మంత్రి కొడాలి నాని.. మరోసారి.. వైసీపీ అనుకూల మీడియాకు ఇంటర్వ్యూ ఇచ్చి మరీ జగన్ ఫ్యామిలీని వెనుకేసుకు వచ్చారు.
కట్ చేస్తే.. ఇంత వరకు బాగానే ఉందని అంటున్నారు పరిశీలకులు. మరి ఇదే జగన్ ప్రజల మధ్య ఉండాలని.. వారి సమస్యలు పట్టించుకోవాలని.. గడపగడపకు తిరగాలని చెబుతున్నా.. నాయకులు ఎందుకు పట్టించుకోవడం లేదనేది వీరి మాట. అయితే.. మీడియా ముందు నోరేసుకుని పడి.. జగన్‌పై స్త్రోత్ర పాఠాలు వల్లెవేసేందుకు పెద్దగా ఖర్చు ఉండదని.. అంటున్నారు.
కానీ, ప్రజల మధ్య తిరగాలంటే మాత్రం.. ఖచ్చితంగా కార్యకర్తలను చేరదీయడం.. ఖర్చు పెట్టడం వంటివి వుంటాయని, దీనికితోడు ప్రజల నుంచి వచ్చే ప్రశ్నలకు సమాధానం చెప్పాల్సి ఉంటుందని.. భావించడం వల్లే నాయకులు ఇలా వ్యవహరిస్తున్నారని చెబుతున్నారు. మరి ఏది నిజమో తేలాలంటే.. వెయిట్ చేయాల్సిందే.