సూర్య, జోతిక అందుకే రెండు సార్లు పెళ్లి చేసుకున్నారా?

హిట్ లతో ఏ మాత్రం సంబంధం లేకుండా వైవిధ్యమైన పాత్రలు పోషించే నటుడు సూర్య.. తమిళ చిత్ర పరిశ్రమలో ఎక్కువ రెమ్యునరేషన్ తీసుకునే హీరోల్లో ఆయన ఒకరు. ఈ స్టార్ హీరోకు తెలుగులోనూ మంచి ఫ్యాన్స్ ఫాలోయింగ్ ఉంది. హీరో సూర్య, హీరోయిన్ జ్యోతికను 2006 పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే.. వీరికి దియా, దేవ్ అనే ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. హీరో సూర్య ఎంత బిజీగా ఉన్నప్పటికీ కుటుంబానికి ప్రత్యేకంగా టైమ్ కేటాయిస్తారు.

ఇక సూర్య, జ్యోతిక వివాహం అయ్యి 15 ఏళ్లు గడిచాయి.. అయితే వీళ్ల గురించి చాలా మందికి తెలియన విషయం ఒకటి ఉంది.. అది ఏంటంటే.. హీరో సూర్య తన భార్య జ్యోతికను రెండు సార్లు పెళ్లి చేసుకున్నారు. వీరిద్దరూ ప్రేమించుకున్న తర్వాత.. అందరూ ప్రేమికుల్లానే సూర్య కూడా తన ప్రేమ విషయం ఇంట్లో చెప్పేందుకు భయపడ్డారు. అందుకే గుట్టుచప్పుడు కాకుండా జ్యోతికను పెళ్లి చేసుకున్నారట. ఆ తర్వాత ఈ సంగతి సూర్య తండ్రి శివకుమార్ కి చెప్పాడట.. ఇద్దరి మతాలు వేరు కావడంతో ఈ పెళ్లి ఆయనకు ఇష్టం లేదట. అయినా చేసేది ఏం లేక.. సూర్య పెళ్లిని మళ్లీ ఘనంగా జరిపించారట.. అలా ఇద్దరు రెండు సార్లు పెళ్లి చేసుకున్నారట..

అయితే ఈ జంట పెళ్లి చేసుకున్న తర్వాత ఎంతో మందికి ఆదర్శంగా నిలిస్తోంది. సినిమాలు చేస్తూనే వృద్ధాశ్రమాలు, అనాధాశ్రమాలు నడుపుతున్నారు. ఇక సినిమాల విషయానికి వస్తే..జై భీమ్ సినిమాతో సూర్య మంచి విజయం అందుకున్నారు. ఇటీవల వచ్చిన విక్రమ్ సినిమాలో సూర్య రోలెక్స్ పాత్రలో కనబడి అలరించాడు. ఇక కమల్ హాసన్ నిర్మాణంలో ఒక సినిమా చేసేందుకు రెడీగా ఉన్నట్లు తెలుస్తోంది. జ్యోతిక కూడా పిల్లల బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహిస్తూనే.. మహిళలకు ప్రాధాన్యత ఉన్న సినిమాల్లో నటిస్తున్నారు..

Share post:

Latest