రష్మిక చేతిపై ఉన్న ఈ టాటూ కి అర్ధం ఏంటో తెలుసా..అస్సలు సీక్రెట్ ఏంటో తెలిస్తే నోరెళ్లబెడతారు..!!

ప్రస్తుతం క్రేజీ హీరోయిన్ గా మారిపోయిన కన్నడ బ్యూటీ రష్మిక మందన `చలో` సినిమాతో కుర్రాళ్ళ మనసు దోచుకుంది. ఆమె టాలీవుడ్ లో చలో, గీతా గోవిందం, సూపర్ స్టార్ మహేష్ బాబు సరసన `సరిలేరు నీకెవ్వరు` లో అంతేకాకుండా పాన్ ఇండియా మూవీ అయినా `పుష్ప` సినిమాలో అల్లు అర్జున్ సరసన శ్రీవల్లి అనే పాత్రలో న‌టించి.. తన చక్కని అందం, ఆకట్టుకునే అభినయంతో ఎంతోమంది తెలుగు ప్రేక్షకుల మనసును గెలుచుకున్న ఈ ముద్దుగుమ్మ రీసెంట్ గా బాలీవుడ్ లో కూడా దూసుకుపోతుంది.

అయితే ప్రస్తుతానికి మాత్రం రష్మిక మందన టాలీవుడ్ లో పుష్ప పార్ట్ 2 లో నటిస్తుంది. అలాగే తమిళంలో కూడా చిత్రాలు చేస్తుంది… అంతేకాకుండా హిందీలో `గుడ్ బాయ్`, `మిషన్ మజ్ను`, యానిమల్ సినిమాలు చేస్తున్న విషయం మన అందరికీ తెలిసింది . అయితే రీసెంట్ గా జరిగిన దేవదాస్ ఫ్రీ రిలీజ్ ఫంక్షన్ లో కనిపించిన రష్మిక కుడి చేతి పై ఉన్న టాటూ వార్త సోషల్ మీడియాలో హల్చల్ చేస్తుంది. అయితే మీడియా కెమెరాలు దృష్టి మొత్తం ఆ ఫంక్షన్ లో ఉన్న రష్మిక మందన చేతి మీద ఉన్న టాటూ మీదే ఫోకస్ పెట్టింది.

రష్మిక చేతిపై ఉన్న పచ్చబొట్టు ఇంగ్లీష్ లెటర్స్ తో Irrepleceable అని దానిపైన ఒక లవ్ సింబల్ కూడా ఉంది. అయితే టాటూ ఒక్క మీనింగ్ ఏంటంటే ఇంపాజిబుల్ టూ రీప్లేస్ అని అర్ధం. అయితే రష్మిక తన సహనటుడు కన్నడ ఫిలింమేకర్ అయిన రక్షిత్ శెట్టితో ఎంగేజ్మెంట్ క్యాన్సిల్ అయిన విషయం మన అందరికీ తెలిసిందే. ఆ విషయంతో రక్షిత్ శెట్టితో బ్రేకప్ రష్మిక మందనాన్ని ఎంత బాధ కలిగించిందో తెలియజేయడానికి తాను అ టాటూ వేసుకుందని సోషల్ మీడియాలో కొన్ని వార్తలయితే వస్తున్నాయి.రష్మిక మందన టాటూ పలుసార్లు బయటపడ్డ కూడా ప్రస్తుతం అయితే అందరి దృష్టిని ఆకర్షించి వైరల్ అవుతుంది. అయితే ఈ టాటూ ప్రభావం ద్వారా వ‌చ్చే రోజుల్లో రష్మిక, రక్షిత్ శెట్టిని మళ్ళీ కలుపుతుందో మనం చూడాలి.