సినీ ఇండస్ట్రీలో మరో గ్రాండ్ వెడ్డింగ్..సడెన్ షాక్ ఇచ్చిన లవ్ బర్డ్స్..!!

ఈ మధ్యకాలంలో సినీ ఇండస్ట్రీలో వరుసగా పెళ్లిలు చేసుకుని సెటిల్ అయిపోతున్నారు మన హీరో , హీరోయిన్లు. ప్రేమించుకున్న జంటలంతా పెళ్లి పేరుతో ఒకటైపోతున్నారు. పెళ్లి తర్వాత ఏమాత్రం ఆలస్యం చేయకుండా గుడ్ న్యూస్ లు చెబుతూ ఒకరి తర్వాత ఒకరి హీరోయిన్స్ అమ్మలు అయిపోతున్నారు .ఇప్పటికే ఆ లిస్టులోకి బోలెడు మంది హీరోయిన్స్ చేరారు. ఎవరు ఊహించిన విధంగా కాజల్ కెరియర్ పిక్స్ లో ఉండగానే పెళ్లి చేసుకుని త్వరగా బిడ్డను కనేసి ఫ్యామిలీ లైఫ్ ని ఎంజాయ్ చేస్తుంది. ఆ తరువాత ప్రణతి శుభాష్ కూడా తల్లి అయ్యిపోయింది.

ఇక తర్వాత ప్రేమించి పెళ్లి చేసుకున్న కత్రినా, అలియా భట్, ఆది పినిశెట్టి.. అందరూ కూడా మ్యారేజ్ లైఫ్ ను ఎంజాయ్ చేస్తున్నారు. ఇక అలియా భట్ అయితే పెళ్లికి ముందే ఒక అడుగు ముందుకేసి పెళ్లయిన రెండు నెలలకే మూడో నెల అంటూ అభిమానులకు షాక్ ఇచ్చింది. కాగా రీసెంట్ గా బాలీవుడ్లో మరో స్టార్ సెలబ్రెటీస్ పెళ్లి చేసుకోబోతున్నట్లు తెలుస్తుంది. బాలీవుడ్ లవ్ బర్డ్స్రిచా చద్దా-ఆలీ ఫజల్ త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నారు. ఇదే విషయం బాలీవుడ్ లో హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతుంది.

గత ఆరేళ్లుగా డేటింగ్ లో ఉన్న ఈ జంట ఎట్టకేలకు పెళ్లి చేసుకోబోతున్నారు. సెప్టెంబర్ 30వ తేదీ నుంచి అక్టోబర్ 7 వరకు అంగరంగ వైభవంగా తమ పెళ్లికి సంబంధించిన ఈవెంట్స్ జరుపుకోబోతున్నారు . ఢిల్లీ లో పెళ్లి ముంబైలో రిసెప్షన్ పెట్టుకోబోతున్నట్లు సమాచారం. అంతేకాదు వధువు రీచా ఆభరణాల గురించి ప్రత్యేకంగా శ్రద్ధ తీసుకుంటుందట . ఆమె పెళ్లి నగలను నగలను 175 ఏళ్ల అనుభవం కలిగిన బికనీర్ కు చెందిన నగల వ్యాపారి కుటుంబానికి ఆర్డర్ ఇచ్చిందట. అంతేకాదు వీళ్ళ పెళ్లి ఇప్పటివరకు ఎవరు చేసుకుని విధంగా అంగరంగ వైభవంగా గ్రాండ్ గా చేసుకోబోతున్నట్లు తెలుస్తుంది. 250 ఫుడ్ ఐటెంస్ తో పెళ్లి భోజనాల మెన్యూ రెడీ చేసారట.