ఓపెన్ అయిపోయిన రష్మిక మందన… ఇకపై అలాంటి పాత్రలకు కూడా రెడీ అంటోంది!

రష్మిక మందన గురించి ప్రత్యేకంగా పరిచయం చేయవలసిన అవసరం లేదు. ప్రస్తుతం ఈ అమ్మడు అన్నిఇండస్ట్రీల్లో పాతుకుపోయి ప్లాన్స్ వేసుకుంటూ పోతోంది. తెలుగులో నటించిన మొదటి సినిమాతోనే అమ్మడు మంచి పేరు తెచ్చుకుంది. ఇక దాంతో వెనక్కి తిరిగి చూసుకోవలసిన అవసరం లేకుండా పోయింది. ఈ మద్దుగుమ్మ నటించిన ప్రతీ సినిమా సూపర్ హిట్ టాక్ తెచ్చుకోవడం వలన బాలీవుడ్ నుండి కూడా ఆఫర్స్ బాగానే వస్తున్నాయి. రష్మిక ఏ ఇండస్ట్రీలో అడుగుపెట్టినా పట్టిందల్లా బంగారమే అన్న సామేతకు ఆమె సరిగా తూగుతుంది.

తమిళ, కన్నడ, తెలుగు, బాలీవుడ్‌ అనే తేడా లేకుండా సినిమాలకు సైన్ చేస్తోంది. తాజాగా సీతారామం మూవీలో నటించిన ఆమె పాత్రకు మంచి పేరే లభించింది. ప్రస్తుతం పుష్ప పార్ట్-2 సినిమాలో నటిస్తున్న రష్మిక.. బాలీవుడ్ లో పలు ప్రాజెక్టులకు సైన్ చేసినట్టు తెలుస్తోంది. ప్రస్తుతం తన చేతిలో బోలెడు సినిమాలు ఉన్నట్టు తెలుస్తోంది. అంతేకాకుండా పలు మల్టీనేషనల్ బ్రాండ్లకు అంబాసిడర్‌గా కూడా చేస్తున్న రష్మిక.. స్పెషల్ సాంగ్స్‌లో నటించడం కొసమెరుపు. త్వరలోనే బాలీవుడ్‌లో రణబీర్ కపూర్‌తో యానిమల్ సినిమాలో హీరోయిన్‌గా ఎంపికైంది.

సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే రష్మిక.. తన గ్లామర్ షోతో కుర్రకారు మతులుపోగొడుతుంది. మోస్ట్ బిజియస్ట్ హీరోయిన్‌గా పేరు తెచ్చుకున్న రష్మిక.. ఈ మధ్యకాలంలో అందాల ప్రదర్శన చేసేందుకు కూడా వెనకాడటం లేదు. త్వరలో బాలీవుడ్‌లో సెటిల్ అయ్యేందుకు తాజాగా డేరింగ్ డెసిషన్ ఒకటి తీసుకున్నట్టు తెలుస్తోంది. అదేంటంటే ఇప్పటివరకు క్యూట్ లుక్స్, సెమీ బోల్డ్‌గా కనిపించిన ఈ ముద్దుగుమ్మ.. త్వరలోనే బికినీ లో కనిపించడానికి కూడా సై అన్నట్టు వార్తలు చక్కర్లు కొడుతున్నాయి.

Share post:

Latest