మెగా అభిమానులకు చరణ్ బిగ్ సర్ ప్రైజ్..ఫ్యాన్స్ కిక్కెక్కించే న్యూస్..!!

రామ్ చరణ్ కు త్రిబుల్ ఆర్ సినిమాతో పాన్ ఇండియా క్రేజ్‌ వచ్చింది. ఈ సినిమా హిట్ అవ్వడంతో రామ్ చరణ్ వరసపెట్టి పాన్ ఇండియా సినిమాలు చేసుకుంటూ దూసుకుపోతున్నాడు. ప్రస్తుతం సెన్సేషనల్ డైరెక్టర్ శంకర్ తో సినిమా చేస్తూ బిజీగా ఉన్నాడు. ఈ సినిమాని వచ్చే ఏడాది సమ్మర్ కు విడుదల చేయడానికి సినిమా యూనిట్ ప్రయత్నాలు చేస్తుంది. ఈ సినిమా కోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ సినిమా అయ్యాక రామ్ చరణ్ తన తర్వాతి సినిమాలను కూడా పాన్ ఇండియా లెవెల్ లోఉండే విధంగా చూసుకుంటున్నాడు. ఈ క్రమంలోనే రామ్ చరణ్ తర్వాత సినిమాల గురించి చాలా రూమర్లు బయటకు వస్తున్నాయి.

Ram Charan on Working With Chiranjeevi, S.S. Rajamouli and Shankar - Variety

ఇందులో భాగంగానే రామ్ చరణ్- శంకర్ సినిమా అయిన వెంటనే జెర్సీ సినిమా తీసిన గౌతమ్ తిన్నాూరితో సినిమా చేస్తారని కొంతకాలంగా వార్తలు వస్తున్నాయి. వీరితో పాటు ఇంకో కొత్త‌ దర్శకుడు పేరు రామ్ చరణ్ తర్వాత సినిమాల లిస్టులో చేరింది. ఆదర్శకుడు మరి ఎవరో కాదు యువ దర్శకుడు సుజిత్. రన్ రాజా రన్ సినిమాతో టాలీవుడ్‌కు పరిచయమైన ఈ దర్శకుడు మొదటి సినిమాతోనే సూపర్ హిట్ అందుకున్నాడు.అ తర్వాత రెండవ సినిమాగా పాన్ ఇండియా హీరో ప్రభాస్ తో సాహో సినిమా తీసి కాస్త నిరాశపరిచాడు.

Ram Charan-Shankar's project lands in another controversy | cinejosh.com

ఇప్పుడు తన మూడో సినిమాని రామ్‌చ‌రణ్ తో తీసే అవ‌కాశాలు క‌నిపిస్తున్నాయి. సుజిత్- రామ్ చరణ్ కి ఒక కథ కూడా చెప్పినట్టు తెలుస్తుంది. ఆ కథ బాలీవుడ్ లో వచ్చిన ధూమ్ సినిమా లాగా ఉంటుందని భారీ యాక్షన్ తో రెండు భాగాలుగా ఈ సినిమా ఉంటుందని సోషల్ మీడియాలో టాక్‌ నడుస్తుంది. రామ్ చరణ్ కి కథ నచ్చడంతో సుజిత్ కి స్క్రిప్ట్ వర్క్ కూడా పూర్తి చేసి రమ్మన్నాడ‌ట‌. శంకర్ సినిమా అయిన వెంటనే సుజిత్ తో సినిమా చేస్తారని తెలుస్తుంది. ఈ వార్త బయటకు రావడంతో రామ్ చరణ్ అభిమానులకు ఆనందం అంతా ఎంత కాదు. ధూమ్ లాంటి సినిమా రామ్ చరణ్ చేస్తున్నాడంటూ సోషల్ మీడియా వ్యాప్తంగా రామ్ చరణ్ అభిమానులు కామెంట్లతో రచ్చ చేస్తున్నారు. ఈ కాంబో పై ఇంకా అధికార ప్రకటన రావాల్సి ఉంది.

Ram Charan Finally Said 'Yes' To Sujeeth? - Movie News

Share post:

Latest