చ‌ర‌ణ్ – శంక‌ర్ సినిమాకు క‌ళ్లు చెదిరే బిజినెస్‌… అన్ని కోట్లా…!

RRR సినిమాతో ప్రపంచ వ్యాప్తంగా రికార్డు క్రేజ్ ని సొంతం చేసుకున్నాడు మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చరణ్. రాజ‌మౌళి తెర‌కెక్కించిన ఈ సినిమాలో మ‌రో హీరోగా యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ న‌టించిన సంగ‌తి తెలిసిందే. రామ్ చ‌ర‌ణ్ అయితే మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు పాత్రలో ఒదిగిపోయాడు. RRRతో ప్రపంచ వ్యాప్తంగా భారీ క్రేజ్ లభించడంతో రామ్ చరణ్ తర్వాత సినిమాల‌కు అదిరిపోయే ప్రి రిలీజ్ బిజినెస్ జ‌రుగుతోంది.

RRR: Ram Charan's first look poster as Alluri Sita Ramaraju defines 'bravery, honour and integrity' | Bollywood Bubble

రామ్ చ‌ర‌ణ్ ప్ర‌స్తుతం సౌత్ ఇండియన్ క్రేజీ డైరెక్టర్ శంకర్ తో చేస్తున్న విషయం తెలిసిందే. RC15 అనే వర్కింగ్ టైటిల్‌తో తెర‌కెక్కుతోన్న ఈ సినిమాలో బాలీవుడ్ బ్యూటీ కియారా అద్వానీ హీరోయిన్ గా నటిస్తుంది. డైరెక్ట‌ర్ శంక‌ర్‌ పొలిటికల్ థ్రిల్లగా ఈ మూవీని తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమా బిజినెస్ ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. నాన్ థియేట్రిక‌ల్ హ‌క్కులే భారీ రేట్ల‌కు అమ్ముడు పోయాయంటున్నారు.

ఈ సినిమా నాన్ థియేట్రిక‌ల్ రైట్స్ దాదాపుగా రు. 200 కోట్లు ప‌లికిన‌ట్టుగా టాక్ ? చ‌ర‌ణ్ సినిమాకు ఈ రేంజ్లో నాన్ థియేట్రిక‌ల్ రైట్స్ ఈ రేంజ్‌లో అమ్ముడు పోవ‌డం నిజంగా రికార్డే. నాన్ థియేట్రికల్ బిజినెసే ఈ రేంజ్ లో ఉందంటే… ఇక థియేట్రికల్ బిజినెస్ ఇంకా ఏ రేంజ్ లో ఉంటుందో చెప్ప‌క్క‌ర్లేదు.

Share post:

Latest