మహేష్ బాబు రాజమౌళి సినిమా కథ ఇదే… మరో అద్భుతాన్ని సృష్టిస్తున్న రాజమౌళి..!

బాహుబలి సినిమాలతో భారతీయ సినిమా స్థాయిని ప్రపంచ దేశాలకు చూపించిన దర్శకుడు రాజమౌళి. ఆయన ఈ సినిమా త‌ర్వాత‌ ఎన్టీఆర్- రామ్ చరణ్‌తో కలిసి తీసిన త్రిబుల్ ఆర్ సినిమా సినిమా ప్రపంచ స్థాయిలో సూపర్ హిట్ అయింది. ఈ సినిమాతో రాజమౌళి మరో మెటెక్కాడనే చెప్పాలి. ఈ రెండు సినిమాల హిట్ అవ్వడంతో ఆయన తరువాత సినిమాపై అందరిలో ఆసక్తి నెలకొంది. ఇప్పుడు ఎలాంటి స్టోరీ తో రాబోతున్నాడా? అని సినీ అభిమానులంతా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇదిలా ఉంటే రాజమౌళి తన తర్వాత సినిమాని సూపర్ స్టార్ మహేష్ బాబుతో చేస్తున్నాడన్న విషయం అందరికీ తెలిసిందే.

వీరిద్దరి కాంబోలో సినిమా అనగానే అందరి కి భారీ అంచనాలే నెలకొన్నాయి. ఇక ఇదే క్రమంలో ఈ సినిమాకు సంబంధించిన ఒక క్రేజి అప్డేట్ బయటికి వచ్చింది. టొరంటో ఇంటర్నేషనల్‌ ఫిలిం ఫెస్టివల్లో రాజమౌళి ఆసక్తికర కామెంట్లు చేశాడు. మ‌హేష్ సినిమా యాక్షన్ అడ్వెంచర్ గా ఉంటుంద‌ని… ఇందులో మహేష్ బాబు ప్ర‌పంచ వ్యాప్తంగా ప్రయాణాలు చేసే వ్యక్తిగా ఉంటాడని రాజమౌళి చెప్పాడు.

Mahesh Babu Upcoming Movie is an African adventure

ఈ సినిమా హాలీవుడ్ సినిమాలుకు తీసుపోకుండా భారీ స్థాయిలోనే ఉంటుందని సోషల్ మీడియాలో టాక్‌ నడుస్తుంది. ఈ సినిమాకి రాజమౌళి తండ్రి విజయేంద్ర ప్రసాద్ కథ అందించనున్నాడు. ఆయన కూడా ఈ సినిమాపై రెండు మూడు సార్లు స్పందిస్తూ ఈ సినిమా కథ ఆఫ్రికన్‌ ఫారెస్ట్‌ నేపథ్యంలో ఉంటుందని చెప్పిన విషయం అందరికీ తెలిసిందే. అయితే మొత్తానికి చూసుకుంటే మహేష్ రాజమౌళి సినిమా లైన్‌ బయటకు రావడంతో మహేష్ అభిమానులు పండగ చేసుకుంటున్నారు. ఓ ఇంటర్వ్యూలో మహేష్ బాబు స్పందిస్తూ రాజమౌళితో సినిమా చేస్తే 25 సినిమాలు చేసినట్టు ఉంటుందని ఆయన చెప్పారు. ప్ర‌స్తుతం విజయేంద్ర ప్రసాద్ కథను సిద్ధం చేసే పనిలో ఉన్నాడు. వచ్చే సంవత్సరం ఈ సినిమా సెట్స్ మీదకు వెళ్ళనుందని తెలుస్తుంది.

Share post:

Latest