ఎన్టీఆర్‌తో తొడ కొట్టించేందుకు జ‌క్క‌న్న ఇంత పెద్ద స్కెచ్ వేశాడా…!

తెలుగు చిత్ర పరిశ్రమలో రాజమౌళి గురించి ఎంత చెప్పినా తక్కువే. తన మొదటి సినిమా స్టూడెంట్ నెంబర్ 1 నుంచి తాజాగా వచ్చిన త్రిబుల్ ఆర్ సినిమా వరకు ఆయన ఒక్కో మెట్టు ఎక్కుతూ భారతదేశంలోనే గొప్ప దర్శకుడుగా పేరు తెచ్చుకున్నాడు. రాజమౌళి ఎన్టీఆర్ మధ్య ఉన్న అనుబంధం గురించి మనకు ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. రాజమౌళి మొదటి సినిమా స్టూడెంట్ నెంబర్ వన్ లో హీరో ఎన్టీఆర్. ఆ సినిమా నుండి వీళ్లిద్దరి మధ్య బంధం కొనసాగుతూ వచ్చింది. వీరిద్దరి కాంబినేషన్లో నాలుగు సినిమాలు వ‌చ్చి అన్నీ సూప‌ర్ హిట్ అయ్యాయి.

తాజాగా రాజమౌళి బాలీవుడ్ సినిమా బ్రహ్మాస్త్రంకు సౌత్ లో సమర్పకుడిగా వ్యవహరిస్తున్నాడు. ఈ సినిమాలో లో రణ‌బీర్ కపూర్- అలియాభ‌ట్‌ హీరో- హీరోయిన్లుగా నటించారు. అయాన్ ముఖర్జీ ఈ సినిమాకు దర్శకత్వం వహించారు. ఈ సినిమా ప్రెస్‌మీట్ హైద‌రాబాద్‌లో గ‌త రాత్రి నిర్వ‌హించారు. ఈ ప్రెస్ మీట్ లో భాగంగా రాజమౌళి మాట్లాడుతూ అనుకోని కారణాలవల్ల మేం నిర్వ‌హించాల‌నుకున్న ప్రి రిలీజ్‌ ఈవెంట్ ఆగిపోయింద‌న్నారు.

ఈ సినిమాలో రణ‌బీర్ కపూర్ అగ్ని ఆస్త్రంగా చేతిలో మంటని పుట్టించే వ్యక్తిగా ఉంటాడు. ఈవెంట్ కి ముఖ్య అతిథిగా ఎన్టీఆర్‌ని పిలిచాం… ఎన్టీఆర్ స్టేజ్ మీదకు వచ్చేటప్పుడు ఆదిలో తొడగొట్టు చిన్న అనే సీన్ ని ఇక్కడ మళ్ళీ రిపీట్ చేద్దామని అనుకున్నామని అన్నారు. రణ‌బీర్ తొడ కొట్టు చిన్న అని చెప్పగానే ఎన్టీఆర్ తొడకొట్టేలా ప్లాన్ చేసాము…. ఎన్టీఆర్ తొడగొట్టేటప్పుడు మంటలు వచ్చేలా భారీసెట్టింగ్ ప్లాన్ చేశామ‌ని రాజ‌మౌళి తెలిపాడు.

అయితే ఫిలిం సిటీలో నిర్వ‌హించాల్సిన ఈవెంట్ క్యాన్సిల్ కావ‌డంతో మ‌నం ఈ తొడ‌గొట్టే దృశ్యాన్ని మిస్ అయిపోయాం. ఈ సినిమాలో అమితాబచ్చన్- నాగార్జున వంటి పలువురు దిగ్గజనుటలు నటిస్తున్నారు తెలుగులో చిరంజీవి ఈ సినిమాకు వాయిస్ ఓవర్ ఇస్తున్నారు. ఈ సినిమా సెప్టెంబర్ 9న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.

Share post:

Latest