పెళ్లయినా కూడా అందులో అసంతృప్తితో ఉన్న ప్రియమణి.. ఏమిటంటే..!!

ప్రముఖ హీరోయిన్ ప్రియమణి గురించి.. ఆమె అందం గురించి ఎంత చెప్పినా తక్కువే.. తన నటనతో తెలుగు సినీ ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును సొంతం చేసుకున్న ప్రియమణి ఎలాంటి పాత్రలోనైనా సరే జీవించగలదు. ఇక ప్రియమణి నటించిన చాలా సినిమాలు మెజారిటీ సక్సెస్ ను సొంతం చేసుకున్నాయి. ఇకపోతే ఇటీవల కాలంలో ఈమెకు కొద్దిగా ఆఫర్లు తగ్గాయి అన్న సంగతి అందరికీ తెలిసిందే. అందుకే బుల్లితెరపై పలు టీవీ షోలకు జడ్జ్ గా వ్యవహరిస్తోంది. ముఖ్యంగా తాను ప్రేమించిన ముస్తఫా రాజ్ ను వివాహం చేసుకున్న ప్రియమణి.. ఆ తర్వాత సినిమాలో తన కెరియర్ అంత ఆశాజనకంగా కొనసాగలేదు . ప్రస్తుతం సరైన ఆఫర్ కోసం ఎదురుచూస్తోంది ఈ ముద్దుగుమ్మ.

The Family Man's Priyamani says she and husband Mustafa have 'very secure  relationship' amid ex-wife's allegations | Bollywood - Hindustan Times

ఇక మొదట పరుత్తివీరన్ సినిమాతో ఇండస్ట్రీకి అడుగుపెట్టిన ప్రియమణి మొదటి సినిమాతోనే జాతీయ అవార్డును సొంతం చేసుకుంది. ఆ తర్వాత ఎవరే అతగాడు సినిమా ద్వారా తెలుగు ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చినా.. పెళ్లయిన కొత్తలో సినిమాతో మంచి పేరును సంపాదించుకుంది. ఇక బాలకృష్ణ , నాగార్జునలకు జోడిగా కూడా నటించడంతోపాటు నితిన్, తరుణ్లకు కూడా జోడిగా నటించింది. యమదొంగ సినిమాతో ఈమె కెరియర్ టర్న్ అయిందని చెప్పవచ్చు. ఎప్పుడు వివాదాలకు దూరంగా ఉండే ప్రియమణి ద్రోణ సినిమాలో బికినీ వేసి అప్పట్లో హాట్ టాపిక్ గా నిలిచింది.Priyamani: 5 splendid photos of the actress that will leave you in awe of  her beauty | The Times of India

ఇక ఏ పాత్రలో నటించిన సరే ఆ పాత్రకు పూర్తి న్యాయం చేసే ఈ ముద్దుగుమ్మ ఇటీవల నారప్ప సినిమాలో కూడా నటించింది. ఇకపోతే పెళ్లయిన తర్వాత ఇప్పటికీ కూడా హీరోయిన్గా కొనసాగించాలని భావిస్తున్న ప్రియమణి.. ఈ విషయంలో అసంతృప్తితో ఉన్నారని సమాచారం. అయితే ప్రియమణికి ఆ స్థాయిలో ఆఫర్లు వస్తాయో లేదో తెలియాల్సి ఉంది. ఇక అయితే మరొకవైపు బన్నీ మాట్లాడుతూ ప్రియమణి ముందు కంటే ఇప్పుడు ఇంకా అందంగా ఉంది.. బహుశా మనం ఇద్దరం కలిసి నటించే అవకాశం వస్తుందేమో చూద్దాం అంటూ కామెంట్లు కూడా చేశారు అల్లు అర్జున్. మరి ఇదే జరిగితే ప్రియమణి సంతృప్తి చెందినట్టే.

Share post:

Latest