ప్రభాస్ – గోపీచంద్ మల్టీస్టారర్ మూవీ ఆగిపోవడానికి కారణం..?

సినీ ఇండస్ట్రీలో మధ్య పోటీ తత్వమనేది చాలానే ఉంటుంది.. కానీ సినిమాల విషయం పక్కన పెడితే వారి నిజ జీవితంలో మాత్రం చాలా స్నేహంగా ఉంటారని చెప్పవచ్చు. అలా సినీ ఇండస్ట్రీలో ఎంతోమంది నటీనటుల సైతం మధ్య మంచి స్నేహబంధం ఉన్నవి మనం చూసే ఉన్నాము.. అలా వర్షం సినిమాలో ప్రభాస్ గోపీచంద్ ఒకరు హీరోగా మరొకరు విలన్ గా నటించి మంచి స్నేహితులుగా మారారు. ఇక ఈ చిత్రం కూడా మంచి ఘనవిజయాన్ని అందుకుంది. దీంతో వీరి స్నేహం గురించి ఇండస్ట్రీలో ఎన్నో రకాలుగా వార్తలు వినిపిస్తూ ఉంటాయి.

Will Prabhas oblige Gopichand's request?
ఇక వీరి స్నేహం కోసం ప్రభాస్, గోపీచంద్ కూడా అన్ని విధాలుగా సహాయపడుతూ ఉంటారు. అయితే వీరిద్దరూ కలిసి ఏదైనా హీరోగా సినిమా చేయాలని వీరిద్దరి అభిమానులు కోరుకోవడం జరుగుతూ ఉంటుంది. అయితే అలాంటి ఒక ప్రయత్నం జరిగిందనే విషయం మాత్రం ఎవరికీ తెలియదు.. బాలీవుడ్ లో వచ్చి బ్లాక్ బస్టర్ హిట్ అయిన షోలే సినిమా నీ తెలుగులో గోపీచంద్,ప్రభాస్ హీరోలుగా పెట్టి ఈ సినిమాని రీమిక్స్ చేయాలని డైరెక్టర్ పూరి జగన్నాథ్ గతంలో ఒకసారి అనుకున్నట్లు తెలుస్తోంది. అయితే ఈ విషయం అప్పట్లో చాలా పాపులర్ గా మారిపోయింది కానీ ఎందుకో ఈ సినిమా ఆగిపోయింది..

Puri Jagannadh sacks his entire team!
అయితే ఇండస్ట్రీలో వినిపిస్తున్న సమాచారం ప్రకారం ఈ సినిమా ఒక క్లాసిక్ సినిమా అని.. ఇలాంటి హీరోలతో ఒక క్లాసిక్ సినిమా తెరకెక్కిస్తే అభిమానులు జీర్ణించుకోలేరని నిర్ణయంతో పూరి జగన్నాథ్ ఈ సినిమాని విరమించుకున్నట్లు సమాచారం. అయితే ఈ షోలే సినిమా అని డైరెక్టర్ రాంగోపాల్ వర్మ ఆగ్ పేరుతో హిందీలో తీసి అట్టర్ ప్లాప్ అయ్యింది. ఇక ఈ షోలే సినిమాలో అమితాబచ్చన్, ధర్మేంద్ర సంజీవ్ కుమార్ హీరోలుగా నటించారు.

Share post:

Latest