ఛీ ఛీ అలాంటి పదాలకు నేను విలువే ఇవ్వను.. పుజా సంచలన కామెంట్స్..!!

పూజా హెగ్డే తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం ఇలా ఏ ఇండస్ట్రీలో నైనా టాప్‌ హీరోయిన్గా ప్రేక్షకులలో ఊహించని స్థాయిలో ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకుంది. కొన్ని సినిమాలు ఫ్లాప్ అవుతున్నా పూజ హెగ్డే ని అభిమానించే అభిమానుల సంఖ్య మాత్రం ఏమాత్రం తగ్గలేదు. అయితే రీసెంట్ గా పూజా స్టార్ డమ్ గురించి మాట్లాడుతూ ఆసక్తికరమైన సంచలన వ్యాఖ్యలు చేసింది. తాను ఈ రేంజ్ కి రావడానికి ఎంతగానో కష్టపడ్డాన‌ని పూజా చెప్పింది.

తాను ఈ స్తాయికి రావడం కోసం తన ఇష్టాలను సైతం వదులుకున్నాన‌ని… చాలామంది సినిమాల్లో అవకాశాల కోసం వచ్చి ఛాన్స్ వచ్చాక హీరోయిన్ అయ్యామా లేదా అని మాత్రమే చూసుకుంటారు. హీరోయిన్ అవ్వడం మాత్రమే ఇంపార్టెంట్ కాదు… ఉన్నత స్థానాలకి చేరుకుని… కొంతకాలం మన పేరు ఇండస్ట్రీలో వినిపింస్తేనే మ‌న ల‌క్ష్యం నెర‌వేరుతోంద‌ని పూజ చెపుతోంది. తాను ఇప్పటివరకు ఎవరిమీద ఎలాంటి బ్యాడ్ కామెంట్స్ చేయలేదు… నా పని ఏంటో నేను చూసుకుని వెళ్ళిపోతాను… తానెప్పుడూ స్టార్ లా కూడా ఫీల్ అవ్వలేదని చెప్పుకొచ్చింది.

తాను స్టార్ట్ డ‌మ్ తలకెక్కించుకొని తల బిరుసుగా ప్రవర్తించలేదని… తనని ఐరన్ లెగ్ అని కామెంట్ చేసిన వాళ్లే ఇప్పుడు తానే నెంబర్ వన్ అంటున్నారని పూజ హెగ్డే చెప్పింది. ఐరెన్‌లెగ్‌, నెంబ‌ర్ వ‌న్ రెండు కామెంట్ల‌ను తాను ఈక్వ‌ల్‌గానే స్వీక‌రించాన‌ని చెప్పింది. సినిమా రంగంలో స్టార్ డమ్ అనేది శాశ్వతం కాదని టైంకి అనుగుణంగా అది మారుతుందని.. అందువల్ల స్టార్ డమ్ గురించి తాను ఎప్పుడూ ఆలోచించలేదని పూజ తెలిపింది.

బాగా యాక్ట్ చేయలేదంటే ఎంత పెద్ద స్టార్ అయినా సరే ఫట్ అవుతారని… ప్రేక్షకులకు యాక్టింగ్ నచ్చితేనే కొత్త వాళ్ళు స్టార్ట్ స్టేటస్ ను అందుకుంటారని ఆమె చెప్పింది. కాబట్టే తాను స్టార్ డమ్ లాంటి పదాలకు అంత పెద్ద ఇంపార్టెన్స్ ఇవ్వనని పూజ వ్యాఖ్యలు చేశారు. అలా పూజ హెగ్డే చెప్పిన విషయాలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

Share post:

Latest