లైగర్ ఎఫెక్ట్..ఆ ప్రాపర్టీని అమ్మేస్తున్న పూరి..!!

సినీ ఇండస్ట్రీలో ఒక భారీ బడ్జెట్ సినిమా డిజాస్టర్ అయితే ఆ నష్టాలు భారం భరించడం చాలా కష్టమని చెప్పవచ్చు. ఇక విజయ్ దేవరకొండ, అనన్య పాండే హీరో హీరోయిన్లుగా నటించిన చిత్రం లైగర్. ఈ సినిమా ఊహించని స్థాయిలో డిజాస్టర్ గా మిగిలిపోయింది. దాదాపుగా రూ. 90 కోట్ల రూపాయలు ప్రీ రిలీజ్ బిజినెస్ జరగగా ఈ సినిమా ఫుల్ రన్ టైం ముగిసేసరికి రూ.25 కోట్ల రూపాయలను మాత్రమే రాబట్టినట్లు సమాచారం. ఇది సినిమా అన్ని భాషలలో కూడా ఫ్లాప్ టాక్ ను సొంతం చేసుకుంది.Ananya Panday And Vijay Devarakonda Introduce 'Liger', a Combination of  Tiger And Lion | India.comఇక ఈ చిత్రం విజయ్ దేవరకొండ తో పాటు పూరి జగన్నాథ్ కెరీర్ పైన తీవ్రమైన ప్రభావం చూపించిందని చెప్పవచ్చు. విజయ్ దేవరకొండ రూ. 6 కోట్ల రూపాయలను తిరిగి ఇచ్చేసారనే వార్తలు కూడా వినిపిస్తూ ఉన్నాయి. అయితే ఈ వార్తలకు సంబంధించి అధికారికంగా ఎటువంటి ప్రకటన చేయలేదు. ఇక ఈ సినిమాలో వాటా తీసుకోవాలని విజయ్ దేవరకొండ అనుకున్నట్లుగా వార్తలు వినిపిస్తూ ఉన్నాయి. మొత్తానికి ఈ చిత్రం ప్లాప్ కావడంతో నిర్మాతలకు సైతం నష్టాలని మిగిల్చినట్లు తెలుస్తోంది. మరొకవైపు పూరి జగన్నాథ్ ఈ చిత్రానికి సంబంధించి రూ. 40 కోట్ల రూపాయల వరకు నష్టాలను భర్తీ చేయడానికి సిద్ధమైనట్లుగా సమాచారం.Puri-Vijay-Devarakonda-film-titled-LIGER-1200×900 | The Telugu News

లైగర్ సినిమా రిలీజ్ కు ముందు వచ్చిన లాభాలతో పాటు ఇస్మార్ట్ శంకర్ వల్ల వచ్చిన లాభాలతో కొన్న ఒక ప్రాపర్టీని పూరి జగన్నాథ్ అమ్మయ్యబోతున్నట్లు ఇండస్ట్రీలో టాక్ వినిపిస్తోంది. ఇక అంతే కాకుండా తన తదుపరి చిత్రాల పైన ఎటువంటి భారం పడకుండా పూరి జగన్నాథ్ ఇలాంటి జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు సమాచారం. ప్రస్తుతం పూరి జగన్నాథ్ తన తదుపరి ప్రాజెక్టుల పైన ఎలాంటి స్పష్టంగా తెలియజేయలేదు. కానీ తన కొడుకుతో ఒక సినిమా చేసేందుకు సిద్ధంగా ఉన్నట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. మరి ఈ విషయాలపై క్లారిటీ రావాల్సి ఉంది.

Share post:

Latest