ఎంపీ స్థానాల్లో లీడ్ మారిపోయింది..!

రాష్ట్రంలో ఎక్కడకక్కడ రాజకీయ సమీకరణాలు మారుతున్నాయి. గత ఎన్నికల్లో ఉన్న పరిస్తితులు…ఇప్పుడు చాలా నియోజకవర్గాల్లో కనిపించడం లేదు. గత ఎన్నికల్లో ప్రతి చోటా వైసీపీ హవా కనిపించింది. అసెంబ్లీ స్థానలైన, ఎంపీ స్థానలైన వైసీపీదే లీడింగ్ అనే పరిస్తితి. అందుకే గత ఎన్నికల్లో 151 ఎమ్మెల్యేలు, 22 ఎంపీలు గెలుచుకుంది. మరి అప్పుడు పరిస్తితి ఇప్పుడు ఉందా? అంటే చాలా వరకు ఆ పరిస్తితి మారుతూ వస్తుంది…చాలాచోట్ల వైసీపీకి పోటీగా టీడీపీ పుంజుకుంటుంది. ఇంకా కొన్ని నియోజకవర్గాల్లో వైసీపీని దాటి టీడీపీ లీడింగ్‌లోకి వస్తుంది.

ఇక ఎంపీ స్థానాల్లో కూడా ఇదే పరిస్తితి ఉందని తాజా సర్వేలు చెబుతున్నాయి. ప్రస్తుతం ఏపీలో మెజారిటీ ఎంపీ స్థానాలు టీడీపీ వైపు ఉన్నాయని విశ్లేషణలు వస్తున్నాయి. తాజాగా వచ్చిన ఓ సర్వేలో శ్రీకాకుళం, విశాఖపట్నం, కాకినాడ, రాజమండ్రి, విజయవాడ బాపట్ల, అనంతపురం పార్లమెంట్ స్థానాల్లో టీడీపీకి 50 వేల ఓట్ల ఆధిక్యం ఉందని తేలింది. అలాగే నంద్యాల, కడప, తిరుపతి, నెల్లూరు, అరకు స్థానాల్లో వైసీపీకి 50 వేల ఓట్ల ఆధిక్యం ఉందని తేలింది.

ఇక విజయనగరం, అనకాపల్లి, అమలాపురం, నరసాపురం, ఏలూరు, మచిలీపట్నం, గుంటూరు స్థానాల్లో కాస్త టీడీపీకి ఎడ్జ్ ఉందని, వీటిల్లో కొన్ని చోట్ల జనసేనకు బలం ఉందని…ఒకవేళ టీడీపీ-జనసేన కలిస్తే ఆ సీట్లని డౌట్ లేకుండా గెలుచుకుంటాయని తెలుస్తోంది. విడివిడిగా పోటీ చేస్తే వీటిల్లో మెజారిటీ సీట్లు వైసీపీ గెలుచుకుంటుందని తెలుస్తోంది.

అలాగే చిత్తూరు, ఒంగోలు, కర్నూలు, హిందూపురం, రాజంపేట స్థానాల్లో వైసీపీకి ఎడ్జ్ ఉందని, కానీ టీడీపీ గట్టి పోటీ ఇస్తుందని తెలుస్తోంది. హిందూపురంలో కాస్త టీడీపీకి ఎడ్జ్ కనిపిస్తోందని సర్వేలో తేలింది. అయితే ఈ సారి కుప్పంలో గాని చంద్రబాబుకు భారీ మెజారిటీ వస్తే చిత్తూరు ఎంపీ సీటు టీడీపీ కైవసం చేసుకుంటుందని లేదంటే వైసీపీ ఖాతాలో పడే ఛాన్స్ ఉందని తెలుస్తోంది. మొత్తానికి ఎంపీ సీట్లలో కూడా వైసీపీ-టీడీపీల మధ్య హోరాహోరీ పోరు నడుస్తోంది.