సమంతను చైతన్య ప్రేమించకపోతే.. బాలకృష్ణ అల్లుడు అయ్యేవాడా?

టాలీవుడ్ ఇండస్ట్రీకి రెండు కళ్ల లాంటివారు సీనియర్ ఎన్టీఆర్, ఏఎన్నార్.. ఇద్దరు ముందు నుంచే మిత్రులు. ఒకే కుటుంబ సభ్యులుగా కలిసి మెలిసి ఉండేవారు..వీరి కుటుంబాల మధ్య ఎంతటి సాన్నిహిత్యం ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. వారి తర్వాత ఆ స్నేహ బంధం నాగార్జున, బాలకృష్ణ మధ్య కూడా కొనసాగుతూ వస్తోంది. ఒకరి ఇంట్లో ఫంక్షన్ జరిగితే మరొకరు కచ్చితంగా వెళ్లేవారు. ఈ స్నేహాన్ని బంధుత్వంగా మార్చుకోవాలని వీరిద్దరూ అనుకున్నారట..

నందమూరి బాలకృష్ణకు ఇద్దరు కూతుర్లు, ఒక కొడుకున్న ఉన్న సంగతి తెలిసిందే. పెద్ద కూతురు బ్రాహ్మణీని నారా లోకేష్ కి ఇచ్చి పెళ్లి చేశారు. ఇక రెండో కూతురు తేజస్విని అక్కినేని నాగచైతన్యకు ఇచ్చి పెళ్లి జరిపించాలని ఇరు కుటుంబాలు భావించాయట.. కానీ నాగచైతన్య మాత్రం సమంతతో లవ్ లో ఉన్నాడు. ఈ విషయాన్ని తండ్రి నాగార్జునకు చెప్పాడు. దీంతో నాగార్జున వెనక్కి తగ్గారట..

ఆ తర్వాత సమంత, నాగచైతన్య పెళ్లి చేసుకున్నారు. కొన్ని సంవత్సరాలు ఎంతో అన్యోన్యంగా జీవించారు. కానీ వీరి పర్సనల్ లైఫ్ లో ఏం జరిగిందో ఏమో ఒక్కసారిగా వారి వివాహ బంధానికి బ్రేకప్ చెప్పేశారు. విడాకులు తీసుకుని అందరికీ షాకిచ్చారు. వీరు విడాకులు తీసుకుని ఏడాది దాటినా.. వీరి గురించి ఏదో ఒక వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతూనే ఉంటుంది. సమంత, నాగచైతన్య విడాకులు తీసుకోవడం ఇప్పటికీ వారి అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు.

సమంత, నాగచైతన్య విడాకుల తర్వాత మరో అంశం తెర మీదకు వస్తోంది. ఒకవేళ సమంతను నాగచైతన్య ప్రేమించకపోతే ప్రస్తుతం నందమూరి బాలకృష్ణకు అల్లుడుగా ఉండేవారిని సోషల్ మీడియాలో చర్చించుకుంటున్నారు. నాగచైతన్య తన చేతులారా తన పెళ్లి క్యాన్సిల్ చేసుకున్నారని అనుకుంటున్నారు. బాలకృష్ణ చైతును అల్లుడిగా రిజక్ట్ చేసి తన రెండో కూతురిని వైజాగ్ గీతం సంస్థల యజమాని కొడుకు భరత్ కి ఇచ్చి పెళ్లి జరిపించారు. ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది..