తెలుగు హీరోలని బాలీవుడ్ హీరోలు కాపీ కొడుతున్నారా? వర్మ బాధేమిటి?

ప్రముఖ వివాదాల దర్శకుడు రామ్ గోపాల్ వర్మ సోషల్ మీడియాలో ఎంత యాక్టివ్ గా ఉంటాడో తెలియంది కాదు. టాలీవుడ్ వరుస సక్సెస్ లు, బాలీవుడ్ ఫెయిల్యూర్స్ మరియు బాయ్ కాట్ బ్యాచ్ పై వివాదాలపై తాజాగా తనదైన శైలిలో వర్మ స్పందించాడు. బాలీవుడ్ హీరోల అహంకార పూరిత మాటలే వారి కొంప ముంచుతున్నాయనీ, అదే మన తెలుగు హీరోలు చాలా వినమ్రతతో ఉంటారని కొనియాడాడు. అందుకే తమ హీరోలని బాలీవుడ్ ప్రేక్షకులు తిరస్కరించాలని భావించి బాయ్ కాట్ నినాదం చేస్తున్నారంటూ వర్మ పేర్కొన్నాడు.

ఈ క్రమంలో బాలీవుడ్ లో వస్తున్న వరుస ఫ్లాప్ ల నేపథ్యంలో అక్కడి హీరోలు తమ యొక్క ఆటిట్యూడ్ ను మార్చుకోవాలని సూచించారు. ఇలా ఎలా ఉండాలనేది తెలుగు సినిమా హీరోలను చూసి నేర్చుకోవాలని వారికి వర్మ గీతోపదేశం చేస్తున్నారు. బాలీవుడ్ లో చాలా వినమ్రంగా ఉన్న హీరోల సినిమాలు ఈమధ్య సక్సెస్ అవుతున్నాయి. అందులో భాగంగానే తెలుగు సినిమాలు అక్కడ మంచి విజయాలను సొంతం చేసుకుంటున్నాయి అన్నాడు. ఇక రామ్ గోపాల్ వర్మ ఇంకా మాట్లాడుతూ విజయ్ దేవరకొండ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.

ఏ ఆటిట్యూడ్ అయితే అతగాడికి మంచి గుర్తింపు తెచ్చిందో బాలీవుడ్ లో అది వర్కౌట్ కాలేదని చెప్పుకొచ్చాడు. హిందీ ప్రేక్షకులు ఆటిట్యూడ్ చూపించే వారిని పక్కన పెడుతున్నారు. అందుకే లైగర్ సినిమా ఫ్లాప్ అయ్యింది అని వర్మ తన అభిప్రాయాన్ని వెలిబుచ్చాడు. మొత్తానికి రామ్ గోపాల్ వర్మ టాలీవుడ్ స్టార్స్ కి మరియు బాలీవుడ్ స్టార్స్ కి మధ్య ఉన్న పలు తేడాలను ఎత్తి చూపిస్తూ చేసిన వాదన మరియు వ్యక్తపరచిన అభిప్రాయాలు లాజిక్ గానే ఉన్నాయంటూ సామాన్యులు కూడా అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

Share post:

Latest