చిరు ‘గాడ్‌ ఫాదర్‌’ చూసి దర్శకుడికి సలహా ఇస్తున్నారా? సంతృప్తిగా లేరా?

మెగాస్టార్ చిరంజీవి నుండి ఓ సినిమా వస్తోంది అంటే తెలుగు చిత్ర సీమలో బజ్ ఏవిధంగా ఉంటుందో చెప్పాల్సిన పనిలేదు. ఇటీవల రిలీజై నిరాశ పరిచిన ఆచార్య సినిమా తరువాత మెగాస్టార్ ‘గాడ్ ఫాదర్’ సినిమాని షురూ చేసారు. హీరో చిరంజీవి నుండి వస్తున్న సినిమా కావడం వలన ఈ సినిమాపైన మంచి హైప్ ఉంది. పైగా ఇది మలయాళ సూపర్ హిట్ అయినటువంటి ‘లూసిఫెర్’ సినిమాకి రీమేక్ కావడం వలన కూడా మంచి హైప్ ఉందనే చెప్పాలి. ఇకపోతే, ‘గాడ్‌ ఫాదర్‌’ సినిమా ఫైనల్‌ కట్‌ను చిరంజీవి ఇటీవల చూశారట.

అది చుసిన తర్వాత చిత్ర దర్శకుడు అయినటువంటి మోహన్‌ రాజాతో చిరంజీవి మాట్లాడారట. ఫైనల్‌ ప్రోడక్ట్‌ మీద సంతృప్తి వ్యక్తం చేసిన చిరంజీవి.. ప్రచారంలో కాస్త జోరు పెంచండి అని చెప్పారని వినబడుతోంది. గత కొన్ని రోజులుగా సినిమా ప్రచారం విషయంలో చిరు అభిమానులు ఇదే మాట అంటున్న విషయం తెలిసిందే. ఎప్పటికప్పుడు సినిమా గురించి మాట్లాడుతూ, ప్రేక్షకుల నోళ్లలో నానితేనే సినిమాలు ఆడటం లేదు. అలాంటిది ప్రచారం లేకుండా ఎలా అని ప్రేక్షకులు, అభిమానులు అనుకున్నారు. ఇప్పుడు చిరంజీవి నోటి నుండి కూడా అలాంటి మాటే రావడం గమనార్హం.

ప్రస్తుతం దానికి తగ్గట్టుగా సినిమా ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ను రెండు చోట్ల నిర్వహిస్తారు అని చెబుతున్నారు. ముంబయిలో ఒకటి, హైదరాబాద్‌లో మరకొటి ఉంటాయట. ఈ మేరకు ఏర్పాట్లు జరుగుతున్నాయని చెబుతున్నారు. ప్రీ రిలీజ్‌ ఈవెంట్లకు ముఖ్య అతిథిగా సల్మాన్‌ ఖాన్‌ కూడా వస్తాడని చెబుతున్నారు. ఈ మేరకు ఇటీవల సల్మాన్‌ నుండి చిరంజీవికి భరోసా వచ్చిందట. అయితే సల్మాన్‌ హాజరు కేవలం ముంబయి ఈవెంట్‌ వరకే ఉంటుందా? లేక హైదరాబాద్‌ ఈవెంట్‌కి కూడా వస్తాడా అనేది ఇంకా తెలియాల్సి వుంది.

Share post:

Latest