చిరంజీవికి మర్చిపోలేని గిఫ్ట్ ఇచ్చిన కృష్ణం రాజు..అదేంటో తెలుసా..?

టాలీవుడ్ సీనియర్ నటులలో ఒకరైన కృష్ణంరాజు ఆదివారం తెల్లవారుజామున మరణించారు. ఆయన మరణించారు అన్న వార్త సినీ అభిమానులను షాక్ కు గురి చేసిందనే సంగతి తెలిసిందే. ఆయన ఎంత గొప్ప నటుడు అన్న సంగ‌తి మనందరికీ తెలుసు. ఆయన రాజకీయాల్లో గాని సినిమాల్లో గాని వివాదాలు దూరంగా ఉంటూ వచ్చారు. ఆయన మరణ వార్త విన్న టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి మాట్లాడుతూ ఆయన లేరనే వార్త నేను ఇప్పటికీ నమ్మలేకపోతున్నాను. ఇది ఎంతో బాధాకరమైన వార్త అని చెప్పుకొచ్చారు. కృష్ణంరాజు తెలుగు చిత్రప‌రిశ్ర‌మ‌కు పెద్ద అన్న లాగా కొనసాగుతూ వచ్చారు. ఆప్యాయంగా పిలుచుకుంటూ తన తోటి నుటులకి ఎంతో ప్రోత్సాహం ఇచ్చారు. ఇదే క్రమంలో చిరంజీవికి ఆయనకి మధ్య ఉన్న అనుబంధం గురించి కూడా చిరంజీవి చెప్పుకొచ్చాడు. చిరంజీవి నటించిన మన ఊరి పాండవులు సినిమాలో కృష్ణంరాజు కూడా కీలకపాత్రలో నటించాడు. ఆ సినిమా నుంచి వీరిద్దరి బంధం ఇప్పటివరకు కొనసాగుతూ వచ్చింది. ఆయన ఎంతో సౌమ్యుడని ఎంతో గొప్ప వాడని చిరంజీవి వ్యాఖ్యానించాడు. రెబల్ స్టార్ అనే బిరుదుకు అసలైన నిర్వచనం కృష్ణంరాజు అని తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.

కృష్ణంరాజు కేంద్ర మంత్రిగా కూడా ఎన్నో సేవలు అందించారు. కృష్ణంరాజు గారు లేని లోటు సినిమా ఇండస్ట్రీకి, లక్షలాదిమంది అభిమానులకు ఎప్పటికీ తీరని లోటు అని చిరంజీవి అభిప్రాయపడ్డాడు. వారి ఆత్మ శాంతించాలని ప్రార్థిస్తూ ఆయన కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతి తెలియజేశాడు చిరంజీవి. ఇదే క్రమంలో కృష్ణంరాజు ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన విషయాలను చిరంజీవి గుర్తు చేసుకున్నాడు అవి ఏమిటంటే. “కృష్ణంరాజు మాట్లాడుతూ చిరంజీవితో తనకు ఎంతో మంచి స్నేహం ఉందని. చిరంజీవి ఇండస్ట్రీకి వచ్చిన మొదటిలో నువ్వు డాన్స్ బాగా చెస్తున‌వు నువ్వు స్టార్ అవుతావని కృష్ణంరాజు చెప్పాడట”.

Krishnam Raju And Chiranjeevi : చిరంజీవితో స్నేహం కోసం నిలిచిన కృష్ణంరాజు.. జీవితంలో మరిచిపోలేని ఘటన | The News Qube

ఇదే క్రమంలో చిరంజీవి పుట్టినరోజు వేడుకలు లండన్లో జరిగినప్పుడు నేను అక్కడికి వెళ్లాను. నా మేనల్లుడుకు లండన్ నుంచి తెప్పించిన కెమెరాతో చిరంజీవి ఫోటోలను తీయమన్నాను అని కృష్ణంరాజు తెలిపారు. ఆ సందర్భంలోనే చిరంజీవి ఆ కెమెరాను చూసి కెమెరా వివరాలు అడగక. కృష్ణంరాజు చిరంజీవి పుట్టినరోజు బహుమతిగా ఎంతో విలువైన కెమెరాను కృష్ణంరాజు చిరంజీవి పుట్టినరోజు బహుమతిగా ఆ కెమెరాని చిరంజీవికి ఇచ్చేసాడట. అప్పుడు చిరంజీవి ఎంతో ఆశ్చర్యానికి గురయ్యాడట తర్వాత ఆయనకి ధన్యవాదాలు చెప్పాడట. ఇలా కృష్ణంరాజు చిరంజీవి పుట్టినరోజుకి ఎంతో విలువైన కెమెరాని బహుమతిగా ఇచ్చిర‌ని చిరంజీవి ఆ సమయంలో గుర్తు చేసుకున్నాడు. ఇప్పుడు ఈ మాటలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

 

 

Share post:

Latest