టాలీవుడ్ లో బాలీవుడ్ పై పూజా సంచలన వ్యాఖ్యలు..ఇంత షాక్ ఇచ్చిందేంటి రా సామీ!!

పొడుగు కాళ్ల సుందరి పూజా హెగ్డే గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈమె సౌత్ సినిమా ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్గా కొనసాగుతుంది. పూజా హెగ్డే తాజాగా బాలీవుడ్‌లో సైతం పలు సినిమాలలో నటించిందింది. అవి విడుదలకు సిద్ధంగా ఉన్నాయి. ఇదే క్రమంలో తాజాగా జరిగిన siima అవార్డ్స్ లో పింకు గౌనులో దర్శనమిచ్చి అందరిని ఆకర్షించింది. అక్కడ ఆమె మీడియాతో మాట్లాడుతూ పలు ఆస‌క్తిక‌ర‌ విషయాలను వెల్లడించింది.

ఆమె బాలీవుడ్ లో నటించిన కొన్ని సినిమాలు విడుదలకు సిద్ధంగా ఉన్నాయి. వాటిలో ‘కీసి క బాయ్ కిసి కి జాన్స‌’ ‘సర్కస్’ ఈ రెండు సినిమాలు కొద్ది రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రానున్నాయి. ఈమె ఈ సినిమాలు గురించి మాట్లాడితే కొన్ని ఆసక్తికర విషయాలు చెప్పింది… ‘ఈ రెండు సినిమాలు తన కెరియర్ లోనే సూపర్ హిట్ అవుతాయని ‘దీనివల్ల తనకి బాలీవుడ్లో ఆఫర్లు వస్తాయని నమ్ముతుందట పూజాహెగ్డే’. తనకి టాలీవుడ్ ఇండస్ట్రీ అన్నా బాలీవుడ్ ఇండస్ట్రీ అన్న రెండు కళ్ళు లాంటివని పూజాహ‌గ్డే చెప్పుకొచ్చింది. తనకి రెండు ఇండస్ట్రీలోనూ నటించడం ఇష్టమేఅని పూజ క్లారిటి ఇచ్చింది’. Siima అవార్డ్స్ లో రెండు siima ఆ ట్రోఫీలను గెలుచుకుంది. ఈ భామ తెలుగులో నటించిన‌ ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్’ సినిమా గాను ‘యూత్ ఐకాన్ సౌత్ ఫిమేల్ గా అవార్డులు వచ్చాయి’. వీటికి సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ అందరికీ ధన్యవాదాలు చెప్పింది.

 

View this post on Instagram

 

A post shared by Pooja Hegde (@hegdepooja)