పవన్ ప్రభావం ఉంది..కానీ బలం?

ఏపీ రాజకీయాల్లో పవన్ కల్యాణ్‌కు బలమైన ఫాలోయింగ్ ఉంది…ఇందులో ఏ మాత్రం డౌట్ లేదు.. ఆయన ఎక్కడ సభ పెట్టిన భారీగా జనం వస్తారు.. కానీ ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే..పవన్‌కు ఫాలోయింగ్ ఉంది…సభలకు జనం వస్తారు గాని…జనసేనకు ఓట్లు మాత్రం ఎక్కువ పడవు. గత ఎన్నికల్లోనే ఆ పార్టీకి 6 శాతం వరకు ఓట్లు పడ్డాయి. సరే మొదటి సారి పోటీ చేశారు కదా…అలా ఓట్లు వచ్చాయి అనుకోవచ్చు.

కానీ ఎన్నికలై మూడున్నర ఏళ్ళు అవుతున్నాయి. మరి ఇప్పటికీ జనసేన బలం పూర్తి స్థాయిలో పుంజుకున్నట్లు కనిపించడం లేదు. గతంలో చిరంజీవి ప్రజారాజ్యం అంత బలం కూడా జనసేనకు ఉన్నట్లు లేదు. అంటే ప్రజలు ఇంకా వైసీపీ-టీడీపీలోనే చూస్తున్నారా? జనసేనని మూడో ఆప్షన్‌గన్ చూస్తున్నారా? అంటే..ఇప్పుడు ఏపీలో జనసేన పరిస్తితి చూస్తే అలాగే కనిపిస్తోంది.  గతంతో పోలిస్తే జనసేనకు రెండు-మూడు శాతం ఓట్లు మాత్రమే పెరిగినట్లు తాజా సర్వేలో తెలుస్తోంది.

తాజాగా ఆత్మసాక్షి సర్వేలో జనసేనకు 9 శాతం ఓట్లు వస్తాయని చెప్పింది. అటు టీడీపీ 44.5 శాతం, వైసీపీకి 43 శాతం ఓట్లు వస్తాయని చెప్పింది. అలాగే టీడీపీకి 95, వైసీపీకి 75, జనసేనకు 5 సీట్లు వస్తాయని చెప్పింది.  ఇక్కడ టీడీపీ-వైసీపీల గురించి కాసేపు పక్కన పెడితే..జనసేనకు 5 సీట్లు అనేది చాలా తక్కువ. గత ఎన్నికల్లో ఒక సీటు గెలుచుకుంది..ఇప్పుడు నాలుగు సీట్లు పెరిగాయి అంతే. అంటే జనసేనకు 10 సీట్లు గెలుచుకునే బలం లేదని తెలుస్తోంది. మరి ఎన్నికల నాటికి ఇంకా బలం పెరుగుతుందేమో చూడాలి.

అయితే పవన్‌కు బలం తక్కువ ఉన్న..ఆయన ప్రభావం ఎక్కువ. చాలా నియోజకవర్గాల్లో జనసేన గెలవకపోవచ్చు గాని, గెలుపోటములని తారుమారు చేస్తుంది. అదే సమయంలో టీడీపీతో గాని జనసేన పొత్తు పెట్టుకుంటే…ఆ రెండు పార్టీలు భారీగా సీట్లు గెలుచుకుంటాయని సర్వేలు చెబుతున్నాయి. అప్పుడు జనసేన దాదాపు 40 సీట్లలో పోటీ చేస్తే 25 పైనే సీట్లు గెలుచుకోవచ్చని అంటున్నారు. చూడాలి మరి నెక్స్ట్ పవన్ ఎలాంటి స్టెప్ తీసుకుంటారో.

Share post:

Latest