రికార్డు షోల‌తో కేక పెట్టించేసిన ప‌వ‌న్ ‘ జ‌ల్సా ‘ … ఇది ప‌వ‌న్ ప‌వ‌ర్ ..!

టాలీవుడ్ మాస్ గాడ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పుట్టిన రోజు సంద‌ర్భంగా ఎక్క‌డ చూసినా ప‌వ‌న్ ఫ్యాన్స్ దుమ్ము రేపేస్తున్నారు. ఏపీ, తెలంగాణ‌తో పాటు అటు అమెరికా, ఇత‌ర దేశాల్లోనూ ప‌వ‌న్ మేనియా అయితే మామూలుగా లేదు. ఇక నిన్న రాత్రి నుంచే ఎక్క‌డిక‌క్క‌డ ప్యాన్స్ భారీ ఎత్తున హంగామాలు చేశారు. ప‌వ‌న్ జ‌ల్సా సినిమాను రి రిలీజ్ చేశారు. ఈ ప్రీమియ‌ర్ షోలు అన్ని హౌస్ ఫుల్ అయ్యాయి.

Jalsa Re-Release: Breaks Multiple Records! - Movie News

ఎప్పుడో 2008లో ప‌వ‌న్ హీరోగా ఇలియానా హీరోయిన్ గా దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబో జ‌ల్సా సినిమా వ‌చ్చింది. ఈ జ‌ల్సా రి రిలీజ్ ప్రీమియ‌ర్ షోల‌ను భారీ ఎత్తున ప్లాన్ చేయ‌గా అదిరే రేంజ్‌లో రెస్పాన్స్ వ‌చ్చింది. జ‌ల్సా రీ రిలీజ్‌ ఇది వరకే రికార్డు మొత్తంలో 500 షో లకి పైగా నమోదు అయ్యి ఆల్ టైం రికార్డు సెట్ చెయ్యగా ఇప్పుడు ఫైనల్ కౌంట్ గా 701 షోస్ ప‌డ్డాయి.

Pawan Kalyan's B-Day mania: Jalsa sensation in Indian Film Industry

రీ రిలీజ్ సినిమాల్లో హ‌య్య‌స్ట్ షోల‌తో జ‌ల్సా వ‌ర‌ల్డ్ రికార్డ్ న‌మోదు చేసిన‌ట్టుగా ఇప్పుడు తెలుస్తుంది. మొత్తానికి అయితే జల్సా సంబరాలు నెక్ట్స్ లెవెల్లోనే ఉన్నాయని ప‌వ‌న్ ఫ్యాన్స్ అంటున్నారు. గీతా ఆర్ట్స్ బ్యాన‌ర్‌పై అగ్ర నిర్మాత అల్లు అర‌వింద్ నిర్మించిన ఈ సినిమాకు దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించారు.

Share post:

Latest